DC vs PBKS IPL 2022 : ఆడుతూ పాడుతూ నెగ్గిన ఢిల్లీ

9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

DC vs PBKS  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపింది. ఇక స్టార్ బ్యాట‌ర్ గా పేరొందిన డేవిడ్ వార్న‌ర్ మామా మ‌రోసారి మెరిశాడు.

వ‌రుస‌గా హాఫ్ సెంచ‌రీతో స‌త్తా చాటాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC vs PBKS )కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశారు ఢిల్లీ బౌల‌ర్లు.

అద్భుత‌మైన బంతుల‌తో ప‌రేషాన్ చేశారు. దీంతో త‌క్కువ స్కోర్ చేసింది పంజాబ్.

 నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 115 ప‌రుగుల‌కే కుప్ప కూలింది. ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ఇదే త‌క్కువ స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం.

9 వికెట్ల‌తో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ . ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ 24 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 

ఖ‌లీల్ అహ్మ‌ద్ 21 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే అక్ష‌ర్ ప‌టేల్ కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఇద్ద‌రిని పెవిలియ‌న్ కు పంపించాడు.

ల‌లిత్ యాద‌వ్ 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ విజ‌యం సునాయ‌సంగా ద‌క్కింది. 

ఇక పంజాబ్ జ‌ట్టులో జితేశ్ శ‌ర్మ ఒక్క‌డే 23 బంతులు ఆడి 5 ఫోర్ల‌తో 32 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

అనంత‌రం ఢిల్లీ క్యాపిట‌ల్స్ కేవ‌లం 10.3 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ కోల్పోయి 119 ప‌రుగులు చేసింది. వార్నార్ 30 బంతులు ఆడి 10 ఫోర్లు ఒక సిక్స్ తో 60 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

పృథ్వీ షా 20 బంతులు ఆడి 7 ఫోర్లు ఒక సిక్స్ తో 41 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. ఇంకా 57 బాల్స్ ఉండ‌గానే ఢిల్లీ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది.

Also Read : ల‌క్నోను దెబ్బ కొట్టిన హాజిల్ వుడ్

Leave A Reply

Your Email Id will not be published!