Delhi Capitals : ఢిల్లీ పోరాటం ప్ర‌శంస‌నీయం

15 ప‌రుగుల‌తో ప‌రాజ‌యం

Delhi Capitals : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో విజ‌యం సాధించేందుకు ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) చివ‌రి దాకా పోరాడింది. ఒక వేళ 19వ ఓవ‌ర్ లో ప్ర‌సిద్ధ్ కృష్ణ గ‌నుక మెయిడెన్ ఓవ‌ర్ వేయ‌క పోయి ఉంటే మ్యాచ్ మ‌రింత ఆసక్తిక‌రంగా మారేది.

అప్ప‌టికే పావెల్ దంచి కొట్ట‌డం స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండ‌గా

ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇక బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగింది.

ఓపెన‌ర్లు ఇద్ద‌రూ జోస్ బ‌ట్ల‌ర్, దేవద‌త్ ప‌డిక్క‌ల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ఒకరు సెంచ‌రీతో మెరిస్తే ఇంకొక‌రు హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నారు.

బ‌ట్ల‌ర్ 116 ర‌న్స్ చేస్తే ప‌డిక్క‌ల్ 54 ప‌రుగులతో రాణించాడు.

ఇక ప‌డిక్క‌ల్ వెనుదిర‌గ‌డంతో బ‌రిలోకి వ‌చ్చిన కెప్టెన్ సంజూ శాంస‌న్ 19 బంతులు ఎదుర్కొని 46 ర‌న్స్ చేశాడు.

ఇందులో 5 ఫోర్లు మూడు సిక్స్ లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 222 ర‌న్స్ చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు.

ఈ ఐపీఎల్ లో ఇదే హ‌య్యెస్ట్ వ్య‌క్తిగ‌త స్కోర్.

భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ చివ‌రి వ‌ర‌కు గెలిచేందుకు ట్రై చేసింది.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. కెప్టెన్ పంత్ 24 బంతులు ఆడి 44 ర‌న్స్ చేశాడు.

ఇందులో 4 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. ల‌లిత్ యాద‌వ్ 24 బంతులు ఆడి 37 ర‌న్స్ చేస్తే పృథ్వీ షా 27 బంతులు ఆడి 37 ర‌న్స్ చేశాడు.

ఇక ఆఖ‌రులో రావ్ మ‌న్ పావెల్ 15 బంతులు ఎదుర్కొని 36 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 సిక్స‌ర్లు ఉన్నాయి.

Also Read : చుక్క‌లు చూపించిన జోస్ బ‌ట్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!