Delhi Capitals Retention : శార్దూల్ ఠాకూర్ ..కేఎస్ భరత్ కు షాక్
ఐదుగురిని వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్
Delhi Capitals Retention : రాబోయే ఐపీఎల్ లో ఎవరిని పెట్టుకోవాలనే దానిపై ఆయా జట్ల యాజమాన్యాలు (ఫ్రాంచైజీలు) తర్జన భర్జనలు పడుతున్నాయి. 2023లో రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడింది. ఈసారి కేరళలోని కొచ్చిలో డిసెంబర్ 23న ఆటగాళ్లను ఏయే జట్లు తీసుకుంటాయనే దానిపై వేలం పాట కొనసాగుతుంది.
నవంబర్ 15 బీసీసీఐ ఐపీఎల్ కమిటీ పూర్తి జాబితాను తమకు సమర్పించాలని ఆదేశించింది ఈ మేరకు ఒక్కో ఫ్రాంచైజీ జట్టు ఒక్కో రీతిన విడుదల చేశాయి.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals Retention) ఐదుగురు ఆటగాళ్లను వద్దనుకుంది. వీరిలో శార్దూల్ ఠాకూర్ , టీమ్ సీఫెర్డ్ , అశ్విన్ హెబ్బార్ , కేఎస్ భరత్ , మన్ దీప్ సింగ్ లకు షాక్ ఇచ్చింది. దీంతో వీరు వేలం పాటలోకి రానున్నాయి. ఇక ఎప్పటి లాగే ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషబ్ పంత్ ను సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక ఆటగాళ్ల పరంగా చూస్తే గతంలో తీసుకున్న వారిని అలాగే పెట్టుకుంది. వీరిలో ఆసిస్ స్టార్ హిట్టర్ డేవిడ్ వార్నర్ , పృథ్వీ షా, పటేల్ , పావెల్ , సర్ఫరాజ్ ఖాన్ , యశ్ ధుల్ , మిచెల్ మార్ష్ , లలిత్ యాదవ్ , అక్షర్ పటేల్ , నోర్టే , చేతన్ సకారియా, కమలేష్ నాగర్ కోటి, ఖలీల్ అహ్మద్ , ఎంగిడి, రెహ్మాన్ , అమన్ ఖాన్ , కుల్దీప్ యాదవ్ , ప్రవీణ్ దూబే , విక్కీ ఓస్వాల్ ను రిటైన్ చేసుకుంది.
ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని అనుకుంటోంది ఢిల్లీ క్యాపిటల్స్ .
Also Read : గుజరాత్ టైటాన్స్ ఆరుగురు రిలీజ్