Manish Sisodia : సిసోడియా బెయిల్ పిటిష‌న్ కొట్టివేత

ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ విష‌యంలో కేసు

Manish Sisodia : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌ద్యం పాల‌సీకి సంబంధించి ఈడీ దాఖ‌లు చేసిన కేసులో మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా(Manish Sisodia) దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్ ను కోర్టు కొట్టి వేసింది. ఇదే కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ క‌మ్యూనికేష‌న్ ఇన్ ఛార్జ్ విజ‌య్ నాయ‌ర్ , వ్యాపార‌వేత్త అభిషేక్ బోయిన్ ప‌ల్లి, మ‌ద్యం కంపెనీ ఎంఎస్ పెర్నోడ్ రికార్డ్ మేనేజ‌ర్ బినోయ్ బాబు బినోయ్ బెయిల్ పిటిష‌న్ల‌ను కూడా కొట్టి వేసింది.

ఇదే కేసులో ప‌లువురి పేర్ల‌ను ఈడీ ఇప్ప‌టికే వెల్ల‌డించింది. కేసు విచార‌ణ‌కు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను విచారించింది. ఢిల్లీ ఈడీ ఆఫీసుకు పిలిపించింది. కానీ ఇంత వ‌ర‌కు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు నిల‌దీశాయి.

మ‌రో వైపు బీజేపీ నేత‌లు సైతం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు. ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. కానీ చెప్ప‌డ‌మే కానీ ఆచ‌ర‌ణ‌లో చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇప్ప‌టికే మ‌ద్యం పాల‌సీ స్కాంలో కోట్లాది రూపాయ‌లు అక్ర‌మంగా చోటు చేసుకున్నాయ‌ని పేర్కొంది ఈడీ. ఈ కేసుకు సంబంధించి జైలు పాలు చేసింది ఈడీ.

Also Read : Supreme Court : జెఎన్‌యుకు సుప్రీంకోర్టు నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!