Supreme Court : జెఎన్‌యుకు సుప్రీంకోర్టు నోటీస్

ది వైర్ ఎడిట‌ర్ పై ప‌రువు న‌ష్టం కేసు

Supreme Court : ది వైర్ ఎడిట‌ర్ పై ప‌రువు న‌ష్టం కేసులో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఎడిట‌ర్ తో పాటు డిప్యూటీ ఎడిట‌ర్ కు జారీ చేసిన స‌మ‌న్ల‌ను హైకోర్టు మార్చి 29న ప‌క్క‌న పెట్టింది. వీటిని కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. జేఎన్ యూ వ్య‌వ‌స్థీకృత సెక్స్ రాకెట్ డాన్ గా చిత్రీక‌రిస్తూ ప్రొఫెస‌ర్ ఏదైనా పత్రం స‌మ‌ర్పించారా లేదా అని ధ్రువీక‌రించాల‌ని కోర్టు సోమ‌వారం ఆదేశించింది.

విశ్వ విద్యాల‌యం లోని సెంట‌ర్ ఫ‌ర్ ఆఫ్ లా అండ్ గ‌వ‌ర్నెన్స్ ఫ్రొఫెస‌ర్ , చైర్ ప‌ర్స‌న్ అమిత్ సింగ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ కేసుపై ధ‌ర్మాస‌నం విచారించింది. జ‌స్టిస్ ఎస్కే కౌల్ , జ‌స్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధ‌ర్మాసనం జేఎన్ యూ ఉప కుల‌ప‌తి తో పాటు ది వైర్ పోర్ట‌ల్ ఎడిట‌ర్ , డిప్యూటీ ఎడిట‌ర్ల‌కు నోటీసులు జారీ చేసింది.

ఎలాంటి ఆధారాలు స‌మ‌ర్పంచ‌కుండా ఎలా ప‌రువు న‌ష్టం కేసుకు సంబంధించి ఫైన్ వేస్తామ‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప‌బ్లిష్ చేసిన క‌థ‌నంలో ఎలాంటి ప‌రువుకు భంగం క‌లిగిన‌ట్లు లేద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇదిలా ఉండ‌గా త‌న ప్ర‌తిష్ట‌ను దిగ జార్చేందుకు నిందితులు త‌న‌పై ద్వేష పూరిత ప్ర‌చారం చేశార‌ని ఫిర్యాదుదారు కింది కోర్టులో వాదించారు.

Also Read : PM Modi Viral : మోదీ నిర్మా ఫోటో వైర‌ల్

 

Leave A Reply

Your Email Id will not be published!