Delhi Govt Transfers : భారీగా ఐఏఎస్ లకు స్థాన చలనం
దాడుల నేపథ్యం ఢీల్లీ సర్కార్ నిర్ణయం
Delhi Govt Transfers : లిక్కర్ పాలసీలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటితో పాటు మరో 14 మంది అధికారుల ఇళ్లపై దాడులు చేపట్టింది.
ఈ మేరకు కేసు నమోదు చేసింది. డిప్యూటీ సీఎంను నిందితుల జాబితాలో నెంబర్ 1గా చేర్చింది. సిసోడియాతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులకు చెందిన ఇళ్లపై దాడులు చేసింది.
ఈ దాడులు దేశ వ్యాప్తంగా 31 చోట్ల చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇదిలా ఉండగా ప్రత్యేకించి మనీష్ సిసోడియా ఇంట్లో 14 గంటలకు పైగా సీబీఐ సోదాలు చేపట్టింది.
డిప్యూటీ సీఎంకు చెందిన ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ లను సీజ్ చేసింది. ఇదిలా ఉండగా సీబీఐ దాడుల అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడారు.
ఇది పూర్తిగా ఉద్దేశ పూర్వకమైన, రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదన్నారు. ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మోదీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఇక ఆప్ సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారీ ఎత్తున ఐఏఎస్ లను బదిలీ(Delhi Govt Transfers) చేసింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇంత పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టడం ఇదే మొదటిసారి.
మరో వైపు ఉదిత్ ప్రకాశ్ రాయ్ పై కూడా వేటు వేసింది. ఆయనను తప్పించాలని ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ కుమార్ సక్సేనా ఆదేశించారు.
Also Read : లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా నిందితుడు