Delhi LG CM : ఢిల్లీలో 400 ఎలక్ట్రిక్ బస్సులు స్టార్ట్
ప్రారంభించిన ఎల్జీ సక్సేనా..సీఎం కేజ్రీవాల్
Delhi LG CM : ఢిల్లీలో కొత్తగా 400 విద్యుత్ బస్సులు మంగళవారం నుండి రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు భారీ ఎత్తున ఖర్చు చేసింది ఆప్ సర్కార్. ఢిల్లీ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది ప్రభుత్వం.
Delhi LG CM Speech
ప్రత్యేకించి మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రకటించింది. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi LG CM) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో కలిసి ఇవాళ 400 కొత్త విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను ఢిల్లీ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్బంగా సీఎం.
సబ్సిడీ పథకంలోని 921 బస్సుల్లో ఈ బస్సులు చేర్చింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా ఈ విద్యుత్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం రూ. 417 కోట్లు సబ్సిడీగా అందజేసింది. కాగా ఢిల్లీ ఆప్ సర్కార్ వీటి కోసం రూ. 3,674 కోట్లు ఖర్చు చేసింది.
దేశంలోనే అత్యధికంగా ఢిల్లీ రోడ్లపై మొత్తం 800 విద్యుత్ బస్సులు కొలువు తీరాయి. 2025 చివరి నాటికి మొత్తం 8,000 బ్సులు ఉండాలన్నది తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Kane Williamson : కీవీస్ జట్టులో విలియమ్సన్