Delhi Liquor Scam : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం సౌత్ గ్రూప్ నిర్వాకం 

అమిత్ అరోరాకు రూ. 100 కోట్లు 

Delhi Liquor Scam : ఏమిటీ సౌత్ గ్రూప్ అనుకుంటున్నారా. దేశంలో సంచ‌ల‌నం రేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో(Delhi Liquor Scam) మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ల‌కు చెందిన గ్రూప్ కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అందంగా పెట్టిన పేరు. ఇందులో అంతా రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపారులు, బ్రోక‌ర్లు ఉన్నారు.

గ‌త కొంత కాలంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌కంప‌న‌లు రేపింది. తెలంగాణ‌, ఏపీ నుంచి ఢిల్లీలో మ‌ద్యం స్కాంలో పాలు పంచు కోవ‌డం ఏమిట‌నే దానిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ సీబీఐ, ఐటీ, ఈడీ రంగంలోకి దిగాక గానీ తెలియ రాలేదు అస‌లు విష‌యం ఏమిట‌నేది.

విచిత్రం ఏమిటంటే ఇందులో ప్ర‌ధాన భూమిక పోషించింది మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత‌, జ‌గ‌న్ రెడ్డికి అనుచ‌రుడిగా పేరొందిన ఎంపీలు విజ‌య సాయి రెడ్డి అల్లుడి సోద‌రుడు, ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి. మాగుంట విష‌యంలో ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు.

ఎందుకంటే ఆయ‌న త‌ర‌మంతా లిక్క‌ర్ వ్యాపారంతోనే ముడిప‌డి ఉన్నారు. కానీ విస్తు పోయేలా చేసింది మాత్రం క‌విత‌క్క ఎంట్రీ. మ‌ద్యం స్కాం లింకు అటు త‌మిళ‌నాడు ఇటు తెలంగాణ‌, ఏపీ, పంజాబ్ , ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌ల‌కు చెందిన వారు ఉండ‌డం కొంత ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం.

తాజాగా ఈడీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు ముఖ్య అనుచ‌రుడిగా పేరొందిన అమిత్ అరోరాను కోర్టులో ప్ర‌వేశ పెట్టింది. ఈ సంద‌ర్భంగా రిపోర్టు దాఖ‌లు చేసింది. ఆప్ కోసం మ‌ద్యం పాల‌సీలో హోల్ సేల్ మ‌ద్యం వ్యాపారుల‌కు లాభం చేకూర్చేలా మార్జిన్ పెట్టారంటూ ఈడీ ఆరోపించింది.

5 శాతం ఉండ‌గా దానిని 12 శాతానికి పెంచారని, ఇందులో 6 శాతం క‌మీష‌న్ వ‌చ్చేలా ప్లాన్ చేశారంటూ తెలిపింది. ఆ మేర‌కు మ‌ద్యం పాల‌సీని త‌యారు చేశారంటూ పేర్కొంది. ఇక సౌత్ గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, శ‌ర‌త్ చంద్రా రెడ్డిలు రూ. 100 కోట్లు ముడుపులుగా ఇచ్చారంటూ బాంబు పేల్చింది.

Also Read : గీత’ దాటుతున్న‌ది ఎవ‌రు

Leave A Reply

Your Email Id will not be published!