MCD Mayor Election Postponed : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా
ఆప్..బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ
MCD Mayor Election Postponed : ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ , డిప్యూటీ మేయర్, నామినేటెడ్ సభ్యుల ఎన్నికలో గందరగోళం నెలకొంది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఎన్నికలను వాయిదా(MCD Mayor Election Postponed) వేస్తున్నట్లు ప్రకటించారు ప్రొటెం స్పీకర్ . పాలనా పరంగా రెండో అతి పెద్ద నిర్ణయాధికార సంస్థ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కిచెందిన అభ్యర్థులు ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు.
చివరకు ఒకరిపై మరొకరు తోసుకోవడం, చివరకు కొట్టుకునేంత దాకా వెళ్లింది. దీంతో ముందస్తుగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ప్రొటెం స్పీకర్. కొత్తగా ఎన్నికైన పౌర సంఘం తొలి సమావేశంలో ప్రత్యర్థి కౌన్సిలర్లు వాగ్వావాదానికి దిగారంటూ ఆప్ ఆరోపించింది.
ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆప్ నినాదాలు చేయగా ఆప్ నాయకుడు , సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గేళి చేశారు. దీంతో ఒకరిపై మరొకరు దాడులకు దిగేందుకు యత్నించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం అకస్మాత్తుగా ముగిసింది.
తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ మేయర్ ఎన్నికకు ముందు సభకు నామినేటెడ్ సభ్యులతో ప్రమాణం చేయించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆప్. ఇక్కడే ఘర్షణకు దారి తీసేలా చేసింది. 15 ఏళ్ల తర్వాత బీజేపీ ఓడి పోవడంతో ఎల్జీ తట్టుకోలేక ఇలా చేశారంటూ ఆరోపించింది ఆప్.
Also Read : జేపీ నడ్డా పదవీ కాలం పొడిగించే ఛాన్స్