Brij Bhushan Sharan Singh : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై నివేదిక సిద్దం
వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
Brij Bhushan Sharan Singh : తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై విచారణ కు సంబంధించి ఢిల్లీ పోలీసులు నివేదిక సిద్దం చేశారు. ఈ మేరకు నమోదు చేసిన పోక్సో చట్టానికి సంబంధించి మైనర్ కాదని , తన మానసిక స్థితి సరిగా లేదంటూ బాధితురాలి తండ్రి పేర్కొన్నారని వెల్లడించారు. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశారు మహిళి రెజ్లర్లు.
కాగా బాధితురాలి తండ్రి వాంగ్మూలం కారణంగా సెక్షన్ 173 కింద నివేదికను సమర్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏప్రిల్ 21న 7 మంది మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో మైనర్ కూడా ఉన్నారు. తక్షణమే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh) పై చర్యలు తీసుకోవాలని, ఆయనను అరెస్ట్ చేయాలని కోరారు. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. చివరకు ఢిల్లీ ఖాకీలు వారిపై దాడికి పాల్పడ్డారు.
అమానుషంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. చివరకు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ మదన్ బి లోకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా ఖాకీల తప్పిదమేనని , ఎందుకని అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించారు. ఇదే క్రమంలో న్యాయ వ్యవస్థ మౌనంగా ఉండడాన్ని కూడా తప్పు పట్టారు.
ఇదిలా ఉండగా జూన్ 15 లోపు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు సంబంధించి విచారణను పూర్తి చేస్తామని రెజ్లర్లకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సిట్ 180 మందికి పైగా విచారించింది.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) 180 మందికి పైగా ప్రజలను విచారించింది మరియు Mr సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.
Also Read : Adipurush Movie : ఆదిపురుష్ చిత్రంపై ఉత్కంఠ
