Jahangirpuri Violence : జ‌హంగీర్ పూరి ఘ‌ట‌న‌పై ఆస్థానా ఆరా

ప్ర‌ధాన నిందితుడు అన్సార్ విచార‌ణ

Jahangirpuri Violence : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన ఢిల్లీ లోని జ‌హంగీర్ పూరి ఘ‌ట‌న‌లో (Jahangirpuri Violence)ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న అన్సార్ ను పోలీస్ క‌మిష‌న‌ర్ రాకేష్ ఆస్థానా విచారించిన‌ట్లు స‌మాచారం.

హింసాకాండ జ‌రిగిన ప్ర‌దేశంలో చాలా మందిని పిలిచి ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు. అన్సార్ ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ మేర‌కు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు నివేదిక‌ను సిద్దం చేయాల్సిందిగా ఆదేశించారు ఆస్థానా.

అన్సార్ కాల్ చేసిన వివ‌రాలు, వాట్సాప్ ద్వారా చాటింగ్ లు ప‌రిశీలిస్తున్నారు. పోలీసు వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అన్సార్(Jahangirpuri Violence) తో పాటు ఘ‌ట‌న‌లో పాల్గొన్న లేదా ప్రేరేపించిన వ్య‌క్తుల‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.

దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌నే కోణంపై ద‌ర్యాప్తు జ‌ర‌పనున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూసిన‌ట్లు స‌మాచారం.

హింస‌కు ప‌శ్చిమ బెంగాల్ తో సంబంధం ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్రానికి ఓ పోలీస్ టీమ్ ను పంపించింది.

నిందితుల‌కు బంగ్లాదేశ్ తో కూడా సంబంధాలు ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జ‌హంగీర్ పురి ప్రాంతంలోని కుషాల్ చౌక్ లో దాదాపు 12 సీసీ టీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు.

బాట‌సారుల‌పై నిఘా ఉంచేందుకు తాత్కాలికంగా మానిట‌రింగ్ స్టేష‌న్ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక కేసులో ప్ర‌ధాన నిందితుడైన అన్సార్ పై మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద చ‌ర్య తీసుకోవాల‌ని కోరుతూ ఆస్థానా ఈడీకి లేఖ రాయ‌డం విశేషం.

Also Read : పీకే ఎంట్రీపై డిగ్గీ రాజా కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!