The Wire Editors Raids : ది వైర్ ఎడిటర్ల ఇళ్లపై ఖాకీల దాడులు
ఫోన్లు..కంప్యూటర్లు..ల్యాప్ టాప్ లు స్వాధీనం
The Wire Editors Raids : కేంద్రంలో నరేంద్ర మోదీ కొలువు తీరిన ప్రభుత్వం కలాలపై ఉక్కు పాదం మోపుతోంది. దేశంలో పలువురు జర్నలిస్టులపై, పత్రికలు, డిజిటల్ మాధ్యమాల వేదికగా నిర్వహిస్తున్న పత్రికలను టార్గెట్ చేస్తూ(The Wire Editors Raids) వస్తోంది. తాజాగా అత్యంత ప్రజాదరణ పొందింది ది వైర్. సోమవారం ది వైర్ ఎడిటర్ల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు దాడులు చేశారు.
సంపాదకులకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ది వైర్ కు సిద్దార్థ్ వరద రాజన్ , ఎంకే వేణు సంపాదకులుగా ఉన్నారు. భారతీయత జనతా పార్టీకి చెందిన అమిత్ మాల్వియా ఫిర్యాదు మేరకు ది వైర్ వార్తా వెబ్ సైట కు చెందిన ఎడిటర్ల ఇళ్లపై దాడులు చేశారు.
సోదాలు చేపట్టారు. ఇదిలా ఉండగా ది వైర్ కు వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్నారు సిద్దార్థ్ వరదరాజన్. బీజేపీ ఐటీ సెల్ కు నేతృత్వం వహిస్తున్న అమిత్ మాల్వియా ఫిర్యాదు మేరకు వారు మోసం, ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ది వైర్ తన ప్రతిష్టను కించ పరిచేలా నకిలీ పత్రాలను రూపొందించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు మాల్వియా.
సోషల్ మీడియా దిగ్గజాలైన వాట్సాప్, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ ల మాతృ సంస్థ మెటా మాల్వియాకు కొన్ని అధికారాలు ఇచ్చిందని , వాటిని విమర్శించే పోస్టులను తొలగించేందుకు ఉపయోగించ వచ్చని తెలిపిన పరిశోధనాత్మక నివేదికలను ది వైర్ ఇటీవల ప్రచురించింది.
సోషల్ మీడియా పోస్ట్ లను అడ్డగించేందుకు బీజేపీ టెక్ ఫాగ్ అనే మానవాతీత యాప్ ను ఉపయోగించిందని ఆరోపిస్తూ ది వైర్ నకిలీ కథనాన్ని ప్రచురించిందంటూ మాల్వియా ఆరోపించారు.
Also Read : సీఏఏ న్యాయ పరిధిలోకి రాదు – కేంద్రం