Democracy Comment : పాలకులకు మినహాయింపు ఎందుకు
ప్రజాప్రతినిధులు చట్టానికి అతీతులా
Democracy Comment : ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది వాళ్లే. అందుకే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఓటు ఆయుధం దానిని ఎలా వాడుకున్నామనే దానిపై ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి . ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు ఊరేగుతున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినంత దోచుకుంటున్నారు. సమాజానికి బాధ్యత వహించాల్సిన వాళ్లు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో సాధించిన విజయాల కంటే కోల్పోయిన సంపదే ఎక్కువ. దేశానికి(Democracy) ప్రధాన వనరుగా ఉన్న వనరులన్నింటినీ అప్పనంగా కాజేస్తున్నారు.
తమ వారికి దోచి పెడుతున్నారు. ఆపై బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు గంప గుత్తగా కట్ట బెడుతున్నారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తూ తమను తాము గొప్పగా ఊహించుకుంటూ చేయరాని పనులన్నీ చేస్తున్నారు.
తలవంపులు తెస్తున్నారు. నేరాలు, ఘోరాలు, హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు, అత్యాచారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జీవిత కాలం సరిపోదు. పాలకులు ఇలా తయారు కావడానికి కారణం ఎవరు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది ఎవరు. ప్రజా దేవాలయాలుగా పేర్కొంటున్న లోక్ సభ , రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలు ఏం చేస్తున్నాయి.
ఎవరిని ఉద్దరించేందుకు ఉన్నాయో ఏలుతున్న వారికే ఎరుక. గ్రామంలోని వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం దాకా , అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా 90 శాతానికి పైగా పక్కదారి పడుతున్న వాళ్లే.
ఏ రోజైతే ఓట్ల కొనుగోలు సంస్కృతి ఈ దేశంలో మొదలైందో ఆనాటి నుంచే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఏ పార్టీ కొలువు తీరినా లేక ఎవరు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చివరకు కొద్ది మంది వ్యాపారవేత్తల కనుసన్నలలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా భావించే ఎన్నికల సంఘం సరైన పాత్ర పోషించడం లేదు. ఇక కీలక సమయంలో తీర్పులు వెలువరించాల్సిన న్యాయ వ్యవస్థ కప్పదాటు ధోరణి అవలంభిస్తోంది. చట్టాల్లోని లొసుగులే లక్షలాది మంది తప్పులు చేసి తప్పించుకుంటున్నారు.
ఇవాళ దర్జాగా ఊరేగుతున్న ప్రజా ప్రతినిధులందరినీ విచారిస్తే ఈ దేశంలో(Democracy) జైళ్లు సరి పోవు. ప్రజలు ప్రభువులు పాలకులు సేవకులు మాత్రమే. కానీ సీన్ మారింది..
ప్రజప్రతినిధులు రాచరికపు పోకడులు అనుసరిస్తున్నారు. ఇకనైనా న్యాయ వ్యవస్థ కళ్లు తెరవాలి. ప్రమాదంలో పడిన దేశాన్ని రక్షించాల్సిన
బాధ్యత కూడా దాని మీదే ఉంది.
చట్ట సభల్లోకి రావాలంటే నీతి, నిజాయితీ, నిబద్దత ఉండేలా చూడాలి. అవినీతి, అక్రమాలు, నేరాలకు పాల్పడే వాళ్లపై నిషేధం విధించాలి. వారి కుటుంబీలను కూడా పోటీ చేయకుండా చూడాలి. వారి ఆస్తులను స్తంభింప చేయాలి.
లేదా జాతీయం చేయాలి. జీవిత ఖైదు విధించాలి. లేదంటే ఉరి శిక్ష వేస్తే మొత్తం వ్యవస్థ అదుపులోకి వస్తుంది. లేక పోతే నేరస్థులు, వ్యాపారులే దేశానికి రాజులవుతారు. ప్రజల్ని బానిసలుగా మార్చేస్తారు.
Also Read : తగ్గేదే లేదంటున్న రైతన్నలు