Ruchira Kamboj : ప్రజాస్వామ్యం భారతదేశానికి మూలం
యుఎన్ లో రుచిరా కాంబోజ్ కామెంట్స్
Ruchira Kamboj : ఐక్య రాజ్య సమితిలో భారత దేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకుని తమ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి మాకు నీతులు చెప్పాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ప్రపంచంలో డెమోక్రసీ గురించి భారత్ కంటే ఇంకే ఏ దేశానికి తెలియదన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం , పత్రికా స్వేచ్ఛపై అడిగిన ప్రశ్నకు యుఎన్ లో రుచిరా కాంబోజ్ స్పందించారు. డెమోక్రసీపై ఏం చేయాలో ఇండియాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
తమ దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం మాట్లాడేందుకు స్వేచ్ఛను కలిగి ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా తమ దేశంలో ఉన్నంత గౌరవం, స్వేచ్ఛ లేదన్నారు రుచిరా కాంబోజ్(Ruchira Kamboj). డిసెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ డిసెంబర్ నెలలో 15 దేశాలకు అధ్యక్షత వహిస్తోంది భారత దేశం. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సంస్కరించిన బహుపాక్షికతపై సంతకం చేసింది. సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ సీటులో కూర్చున్నారు రుచిరా కాంబోజ్.
ఆమె నెలవారీ కార్యక్రమంపై ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై ఏమి చేయాలో మాకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం భారతదేశం అని పేర్కొన్నారు రుచిరా కాంబోజ్.
మా దేశానికి 2,500 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ప్రపంచానికి పాఠం నేర్పిన ఘనత కూడా తమదేనని పేర్కొన్నారు. లెజిస్లేచర్ , ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్ , సోషల్ మీడియాకు కేరాఫ్ గా ఉందన్నారు రుచిరా కాంబోజ్.
Also Read : హిందువులు అల్లర్లకు దూరం – సీఎం