Justice BV Nagarathna : నోట్ల ర‌ద్దు చ‌ట్ట విరుద్దం – నాగ‌రత్న

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

Justice BV Nagarathna : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన నోట్ల ర‌ద్దు వివాదానికి సుప్రీంకోర్టు తెర దించింది. 4:1 తేడాతో కోర్టు నోట్ల రద్దు స‌బ‌బే అని పేర్కొంది. జ‌స్టిస్ గ‌వాయ్ తో కూడిన ధ‌ర్మాస‌నం భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేసింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై స‌వాల్ చేస్తూ 58 పిటిష‌న్లు దాఖ‌లు చేశాయి.

విచార‌ణ చేప‌ట్టిన కోర్టు జ‌న‌వ‌రి 2న సోమ‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది. మొత్తం ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నంలో న‌లుగురు న్యాయ‌మూర్తులు కేంద్ర స‌ర్కార్ కు వంత పాడారు. అది స‌బ‌బేన‌ని పేర్కొన్నారు. కానీ ఒకే ఒక్క‌రు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ నాగ‌ర‌త్న మాత్రం భిన్నంగా(Justice BV Nagarathna) స్పందించారు.

నోట్ల ర‌ద్దు పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. ఎందుకు త‌ప్పో సోదాహ‌ర‌ణంగా వివ‌ర‌ణ ఇచ్చాచ‌రు జ‌స్టిస్ . ఇక భ‌విష్య‌త్తులో ఈ నిర్ణ‌యానికి చ‌ట్ట ప‌ర‌మైన స‌వాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. నోట్ల ర‌ద్దు అమ‌లు చేసిన విధానం చ‌ట్టానికి అనుగుణంగా లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు జ‌స్టిస్ నాగ‌రత్న‌.

నోట్ల ర‌ద్దు ప్ర‌క్రియ‌ను కేంద్రం ప్రారంభించ లేద‌ని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సార‌థ్యంలోని కేంద్రం పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం న‌వంబ‌ర్ 8, 2016 నాటి కేంద్రం నోటిఫికేష‌న్ ను పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని మండిప‌డింది . ఆర్బీఐ చ‌ట్టంలోని సెక్ష‌న్ 26 ప్ర‌కారం ర‌ద్దు చేయ‌లేద‌న్న పిటిష‌న‌ర్ల వాద‌న‌తో ఏకీభ‌విస్తున్న‌ట్లు తెలిపారు జ‌స్టిస్ నాగ‌ర‌త్న‌(Justice BV Nagarathna).

కేంద్ర స‌ర్కార్ , ఆర్బీఐ స‌మ‌ర్పించిన ప‌త్రాలు , రికార్డుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత కేంద్ర స‌ర్కార్ కోరుకున్న‌ట్లు వంటి ప‌ద‌బంధాలు ఆర్బీఐకి స్వ‌తంత్రంగా మ‌న‌స్సులో వ‌ర్తించ లేద‌ని పేర్కొన్నారు.

Also Read : నోట్ల ర‌ద్దుపై సుప్రీం సంచ‌ల‌న తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!