Deputy CM Pawan : ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం
ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం..
Deputy CM Pawan : జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్ డేగా ఇవాళ జరుపుకుంటున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. దేశ అభివృద్ధికి సూచికలైన ఇంజినీర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంజినీర్స్ డే సందర్భంగా ‘సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ’ అనే నినాదంతో ఇంజినీర్లు తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి సాధించిన దేశంగా భారతదేశం వేగంగా ప్రయాణిస్తున్న వేళ ఇంజినీర్లు సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ప్రతి సవాలును మన ఇంజినీర్లు సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు పవన్ కల్యాణ్(Deputy CM Pawan) అభిలాషించారు.
Deputy CM Pawan Comment
మనం నాటిన ప్రతి చెట్టు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తుందని, అయితే పరిష్కారంగా కనిపించిన కోనోకార్పస్ చెట్టు ప్రస్తుతం పర్యావరణానికి, నీటికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘ మన భూమి అందాన్ని, సమతుల్యతను దెబ్బతీసే వృక్ష జాతులను అనుమతించబోము. భారత మూలాలను, దేశ మట్టిని సంరక్షించే చెట్లతో రక్షించాల్సిన సమయం ఇది. వేప, రావి, మన స్థానిక సంరక్ష చెట్లను ఎంచుకుందాం. ఇవాళ మనం తీసుకునే నిర్ణయాలపైనే మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించండి’’ అంటూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Also Read : PM Modi : జార్ఖండ్ జంషెద్పూర్ భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని…విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ