Devadutt Padikkal : ధర్మశాల వేదికగా జరిగిన ఐపీల్ లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది.
అనంతరం 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్. మరోసారి ఓపెనర్ జోస్ బట్లర్ నిరాశ పరిచాడు. ఐపీఎల్ 16వ లీగ్ లో మూడోసారి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో కగిసో రబాడా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. జోస్ ఆడలేక పోయాడు. ఈ తరుణంలో మైదానంలోకి వచ్చిన దేవదత్ పడిక్కల్(Devadutt Padikkal) కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఓ వైపు జైస్వాల్ ఆచితూచి ఆడితే అందుకు భిన్నంగా పడిక్కల్ సత్తా చాటాడు. ఆటకు భిన్నంగా దుమ్ము రేపాడు.
పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ మ్యాచ్ ను తమ జట్టు వైపు తిప్పేశారు. జైశ్వాల్ 36 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతో 50 రన్స్ చేశాడు. పడిక్కల్ 30 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. హెట్మెయర్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 46 రన్స్ చేశాడు. సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న పడిక్కల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read : Shahrukh Khan
