Devdutt Padikkal : సంజూ శాంసన్ కెప్టెన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో జైత్రయాత్ర కొనసాగుతోంది.
మిగతా జట్ల లాగా కాకుండా భిన్నంగా, సంప్రదాయ బద్దంగా ఆడుతోంది. జట్టు పరంగా ఒకరు విఫలమైనా మరొకరు దానిని భర్తీ చేస్తున్నారు. ఒకవేళ ఆడక పోయినా తుది జట్టులో ఉండేలా కంటిన్యూ చేస్తుండడం ఆ జట్టుకు ఉన్న ప్రత్యేకత అని చెప్పక తప్పదు.
ఎక్కడా టెన్షన్ కు లోను కాని కెప్టెన్లలో కేరళ సూపర్ స్టార్, స్టార్ హిట్టర్ గా పేరొందిన సంజూ శాంసన్ వ్యవహార శైలి కూడా ఇప్పుడు ఆ జట్టుకు అదనపు బలంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే పూర్తి పాజిటివ్ దృక్ఫథంతో తన ఆట తీరు ఉంటుంది. ప్రధానంగా ఆ జట్టుకు హెడ్ కోచ్ గా కుమార సంగక్కర రావడంతో జట్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 222 పరుగగులు చేసింది.
ఐపీఎల్ లో ఇదే హయ్యెస్ట్ స్కోర్ ఇప్పటి దాకా. ఓ వైపు సెంచరీతో జోస్ బట్లర్ చెలరేగి పోతే మొన్నటి దాకా నిరాశ పరిచిన దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal )ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. వస్తూనే ధాటిగా ఆడడం మొదలు పెట్టాడు.
ఇక పడిక్కల్ కేవలం 35 బంతులు మాత్రమే ఎదుర్కొని 54 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : జార్ఖండ్ డైనమెట్ వల్లే ఓడి పోయాం