Devika Bulchandani : ఓగిల్వీ కంపెనీ సీఇఓగా బుల్చందానీ
ప్రవాస భారతీయురాలికి అరుదైన గౌరవం
Devika Bulchandani : ప్రవాస భారతీయురాలికి అరుదైన గౌరవం లభించింది. ఓగిల్వి ఇంటర్నేషనల్ కంపెనీకి సిఇఓగా ఎంపికయ్యారు దేవిక బుల్చందానీ. చైర్ ఉమెన్ ఆఫ్ అడ్వైర్టైజింగ్ గా నియమించినట్లు ఓగిల్వి ప్రకటించింది.
ఈ కంపెనీ ప్రకటనలు, బ్రాండ్ అండ్ కంటెంట్ , పబ్లిక్ రిలేషన్స్ , ఇన్ ఫ్లుయెన్స్ , అనుభవం, గ్రోత్ ఇన్నోవేషన్ , హెల్త్ తదితర రంగాలకు విస్తరించి ఉంది.
యునైటెడ్ స్టేట్స్ , కెనడా అంతటా ఓగిల్వీ ప్రధాన వ్యాపారాన్ని నడిపించే బాధ్యత దేవిక బుల్చందానీ పై ఉంటుంది. ఆమె గ్లోబల్ నెట్ వర్క్ లో ఓగిల్వీ ప్రకటనల వ్యాపారానికి కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
ఓగిల్వి కంపెనీ కోసం గ్లోబల్ సిఇఓగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు ఆండీ మెయిన్. దేవిక బుల్చందానీ(Devika Bulchandani) కి అపారమైన అనుభవ కలిగి ఉన్నారు.
ఇది కంపెనీకి మరింత దోహద పడేలా చేస్తుందని పేర్కొన్నారు. పదునైన అవగాహన, సృజనాత్మకతను వృద్దికి ఉత్ప్రేరకంగా ఉపయోగించడంలో కాదనలేని ట్రాక్ రికార్డు ఉందన్నారు.
ఉత్తర అమెరికా అంతటా దేవ్ తమ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. క్లయింట్లు తమ వ్యాపారాల కోసం వేగం, స్థాయిలో భారీ విలువను సృష్టించేందుకు అవసరమైన ఆలోచనలను అందించేందుకు ఓగిల్వీ కంపెనీ బలమైన స్థానంలో ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా దేవిక బుల్చందానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిశ్రమలో డేవిడ్ ఓగిల్వీ ఎంతగానో అభివృద్ది చేశారు. ఆండీతో కలిసి పని చేసేందుకు సంతోషంగా ఉందన్నారు. ఇటీవల దేవిక మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ కు ఉత్తర అమెరికా అధ్యక్షురాలిగా పని చేశారు.
Also Read : యుఎన్ మానవ హక్కుల చీఫ్గా టర్క్