Devon Conway : డెవాన్ కాన్వే మార‌థాన్ ఇన్నింగ్స్

హైద‌రాబాద్ కు చుక్క‌లు చూపించాడు

Devon Conway : ఐపీఎల్ లో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మ్యాచ్ చివ‌రి దాకా ఉత్కంఠ‌ను రేపింది. మ‌ళ్లీ సీఎస్కేకు పగ్గాలు చేప‌ట్టాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ.

దీంతో టాస్ ఓడి పోయి మొద‌ట‌గా బ్యాటింగ్ చేసింది చెన్నై. రుతురాజ్ గైక్వాడ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఒక్క ప‌రుగు తేడాతో సెంచ‌రీ చేయ‌లేక పోయాడు. 99 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు.

ఇక మ‌రో స్టార్ హిట్ట‌ర్ డెవాన్ కాన్వే తానేమీ త‌క్కువ కాద‌న్న‌ట్టు చెల‌రేగాడు. 85 ప‌రుగులు చేశాడు. అద్బుత‌మైన ఇన్నింగ్స్ తో రాణించాడు. ఇంత‌కీ డెవాన్ కాన్వే(Devon Conway) ఎవ‌రు అనే ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు.

ఇత‌డి పూర్తి పేరు డెవాన్ ఫిలిప్ కాన్వే. 8 జూలై 1991లో పుట్టాడు. వ‌య‌సు 30 ఏళ్లు. ద‌క్షిణాఫ్రికా లోని జోహెన్నెస్ బ‌ర్గ్ గౌటెంగ్ ప్రావిన్స్ ఇత‌డి స్వ‌స్థ‌లం.

ఎడ‌మ చేతి బ్యాట‌ర్. టాప్ ఆర్డ‌ర్ లో కీల‌క మైన పాత్ర పోషిస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టి దాకా ఆ దేశం త‌ర‌పున టెస్టు, వ‌న్డే, టీ20 ఫార్మాట్ ల‌లో ఆడాడు. ఇప్ప‌టి దాకా ప‌లు లీగ్ ల‌లో ఆడాడు.

2022లో బెంగ‌ళూరు వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 12, 13ల‌లో జ‌రిగిన మెగా వేలం పాట‌లో సీఎస్కే డేవాన్ కాన్వేను చేజిక్కించుకుంది. విచిత్రం ఏమిటంటే డెవాన్ కాన్వే ప్ర‌స్తుతం న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం విశేషం.

మొత్తంగా నిన్న‌టి మ్యాచ్ లో మాత్రం స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ప్ర‌ధానంగా స్టార్ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్ ను ఉతికి ఆరేశారు.

Also Read : ఫామ్ లోకి వ‌చ్చిన కోహ్లీ అనుష్క హ్యాపీ

Leave A Reply

Your Email Id will not be published!