Devon Conway Ruturaj : రాణించిన రుతురాజ్ మెరిసిన కాన్వే

ముంబై బౌల‌ర్ల‌కు బ్యాట‌ర్లు చుక్క‌లు

Devon Conway Ruturaj : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లీగ్ మ్యాచ్ లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ పోరులో సీఎస్కే చేతిలో ముంబై ఇండియ‌న్స్ మ‌రోసారి చిత్త‌యింది. సీఎస్కే బౌల‌ర్లు చుక్క‌లు చూపించ‌డంతో ముంబై బ్యాట‌ర్లు విల విల లాడారు. ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు.

మ‌హేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త‌న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని తేలింది. మైదానంలోకి వ‌చ్చిన ముంబై బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. ఒక నెహాల్ వ‌ధేరా మాత్రం దుమ్ము రేపాడు. 51 బంతులు ఆడి 64 ర‌న్స్ చేశాడు. సూర్య భాయ్ 26 ర‌న్స్ తో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది ముంబై.

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆడుతూ పాడుతూ పూర్తి చేసింది చెన్నై సూప‌ర్ కింగ్స్. ఆ జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్లు రుతురాజ్ గైక్వాడ్ , డేవాన్ కాన్వే ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. ముంబై బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొన్నారు. చెన్నై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

డెవాన్ కాన్వే 44 ర‌న్స్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ (Devon Conway Ruturaj) 30 ప‌రుగులు చేశారు. ఇక అజింక్యా ర‌హానే 21 ర‌న్స్ తో ఆక‌ట్టుకోగా యంగ్ క్రికెట‌ర్ శివ‌మ్ దూబే 27 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది సీఎస్కే.

Also Read : ప‌తిరాణా సెన్సేష‌న్ ముంబై ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!