Devon Conway : డేవాన్ కాన్వే షాన్ దార్ ఇన్నింగ్స్

అయినా చెన్నైకి త‌ప్ప‌ని ఓట‌మి

Devon Conway : ఐపీఎల్ 2022లో మెగా టోర్నీలో భాగంగా పుణె వేదిక‌గా జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో ఆర్సీబీ 13 ర‌న్స్ తో విజ‌యం సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ చివ‌రి దాకా పోరాడింది.

ఒక వేళ డేవాన్ కాన్వే గ‌నుక అవుట్ కాక పోయి ఉండి ఉంటే సీఎస్కే సునాయ‌సంగా గెలుపొంది ఉండేది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 173 ర‌న్స్ చేసింది.

అనంత‌రం టార్గెట్ ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన సీఎస్కే 160 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ స్కోర్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసింది మాత్రం స్టార్ హిట్ట‌ర్ డేవిన్ కాన్వే(Devon Conway). ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

వ‌చ్చీ రావ‌డంతోనే బాద‌డం మొద‌లు పెట్టాడు. కేవ‌లం 37 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న డేవిన్ కాన్వే(Devon Conway) 56 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి.

పూర్తి పేరు డేవాన్ ఫిలిప్ కాన్వే. 8 జూలై 1991లో ద‌క్షిణాఫ్రికా గోటెంగ్ ప్రావిన్స్ లోని జోహ‌న్నెస్ బ‌ర్గ్ లో పుట్టాడు. ప్ర‌స్తుతం 30 ఏళ్లు. ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్. రైట్ ఆర్మ్ మీడియం బౌల‌ర్. టాప్ ఆర్డ‌ర్ లో బ్యాట‌ర్ గా పేరొందాడు డేవాన్ కాన్వే.

2 జూన్ 2021లో ఇంగ్లాండ్ తో జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో త‌న కెరీర్ ప్రారంభించాడు. 20 మార్చి 2021 బంగ్లాదేశ్ తో వ‌న్డే ఆడాడు. 27 న‌వంబ‌ర్ 2020లో వెస్టిండీస్ త‌ర‌పున టీ20 అరంగేట్రం చేశాడు డేవాన్ కాన్వే.

2008 నుంచి 2021 దాకా లీగ్ టోర్నీలోలో పాల్గొన్నాడు. 2022లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవాన్ కాన్వేను సీఎస్కే చేజిక్కించుకుంది.

Also Read : టీ20లో భార‌త్ టెస్టులో ఆసిస్ వ‌న్డేలో కీవీస్

Leave A Reply

Your Email Id will not be published!