DGCA : దివ్యాంగుల‌ను ఆపితే క‌ఠిన చ‌ర్య‌లు – డీజీసీఏ

మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన డీజీసీఏ

DGCA : భార‌త దేశంలోని విమాన‌యాన సంస్థ‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ). వైక‌ల్యం లేదా త‌గ్గిన క‌ద‌లిక ఆధారంగా ప్ర‌యాణికుల‌ను త‌మ విమానంలో ఎక్కకుండా ఆప వ‌ద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఒక‌వేళ ఎవ‌రు లేదా ఏ ఎయిర్ లైన్స్ సంస్థ చేసినా తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీజీసీఏ(DGCA) హెచ్చ‌రించింది. విమానం ఎక్కే స‌మ‌యంలో వారి పరిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే నెపంతో ఎక్క‌నీయ‌కుండా కొన్ని సంస్థ‌లు అడ్డుకున్నాయి.

ఈ విష‌యం పెద్ద ఎత్తున వెలుగులోకి వ‌చ్చింది. చివ‌ర‌కు కేంద్ర మంత్రి స్వ‌యంగా జ‌రుగుతున్న తీరును ద‌గ్గ‌రుండి చూశారు. స‌ద‌రు ఎయిర్ లైన్స్ కు జ‌రిమానా కూడా విధించారు.

ఎవ‌రినైతే ఎక్క‌కుండా చేసే కంటే ముందు విమాన‌యాన సంస్థ‌లు వైద్యుల అభిప్రాయాన్ని తీసుకోవాల‌ని డీజీసీఏ స్ప‌ష్టం చేసింది.
దీనిని త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఒక వేళ ప్ర‌యాణీకుల‌ను ఎక్క‌నీయ‌కుండా చేయాల‌ని అనుకుంటే పౌర విమాన‌యాన అవ‌స‌రాలు (సీఏఆర్) సంబంధిత అధికారి నిర్ణ‌యాన్ని , కార‌ణాల‌ను రాత పూర్వ‌కంగా తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది డీజీసీఏ.

వైద్యుల నిర్ణ‌యం మేర‌కు అత‌డు లేదా ఆమె ఫిట్ అవునా కాదా అన్న‌ది వైద్యులు నిర్ణ‌యిస్తార‌ని ఎయిర్ లైన్స్ లు కావ‌ని పేర్కొంది. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం డీజీసీఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

గ‌త మేలో ఇండిగో ఎయిర్ లైన్ అధికారులు రాంచీ నుండి ప్ర‌త్యేక సామ‌ర్థ్యం ఉన్న చిన్నారిని విమానం ఎక్క‌కుండా అడ్డుకున్నారు. ఇది నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ గా మారింది. దీంతో కేంద్ర మంత్రి సింధియా తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

Also Read : ఆకాసా ఎయిర్ లైన్స్ బుకింగ్ షురూ

Leave A Reply

Your Email Id will not be published!