Chopper Seized : డీహెచ్ఎఫ్ఎల్ స్కాం ‘ఛాపర్’ స్వాధీనం
రూ. 34, 615 కోట్ల భారీ కుంభకోణం
Chopper Seized : భారత దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ మోసం కేసులో నిందితుల నుండి అగస్టా వెస్ట్ ల్యాండ్ ఛాపర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్కాం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
పూణేలోని బిల్డర్ అవినాష్ భోసలే ఆస్తి నుండి అగస్టా వెస్ల్ ల్యాండ్ హెలికాప్టర్(Chopper Seized) ను స్వాధీనం చేసుకుంది. దేశంలోని అతి పెద్ద కుంభకోణాలలో ఒకటిగా పేరుంది డీహెచ్ఎఫ్ఎల్ స్కాం.
రూ. 34,000 వేల కోట్ల దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ , మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ మేరకు బిల్డర్ కు చెందిన ఆస్తులలో ఒకటిగా ఉన్న హెలికాప్టర్ ను స్వాధీనం చేసుకుంది సీబీఐ. పూణేలోని డీహెచ్ఎఫ్ఎల్ స్కాంలలో ఒకడిగా ఉన్నారు అవినాష్ బోసలే.
పాప్ కల్చర్ పోస్టర్లతో హ్యాంగర్ లాగా నిర్మించిన పెద్ద హాలులో దాచి ఉంచిన హెలికాప్టర్ ను కనుగొన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు.
ఈ కుంభ కోణంలో సంపాదించిన ఆస్తులను గుర్తించేందుకు సీబీఐ గత కొద్ది రోజులుగా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకు మోసం కేసులో డీహెచ్ఎఫ్ఎల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ లు కపిల్ వాధవాన్ , దీపక్ వాధవాన్ , ఇతరులపై జూన్ 20న సీబీఐ అభియోగాలు మోపింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం రూ. 34, 615 కోట్ల బ్యాంకు రుణాలను నకిలీ ఖాతా పుస్తకాలకు మళ్లించడం ద్వారా మోసం చేసినట్లు గుర్తించారు.
Also Read : గోటబయ భవనంలో రూ. 17.85 మిలియన్లు