MS Dhoni : ఐపీఎల్ 2022లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదే విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ లో తెలిపాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధ్రువీకరించింది. దీంతో ఇక నుంచి ఆడే లీగ్ మ్యాచ్ లకు యధావిధిగా జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది.
2021 లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లో ధోనీ సారథ్యంలో ఏకంగా టైటిల్ గెలుపొందింది. ఇదే సమయంలో ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 ప్రారంభం కంటే ముందే ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశాడు. దీంతో తన స్థానంలో రవీంద్ర జడేజా అలియాస్ జడ్డూ కు అప్పగిస్తున్నట్లు వెల్లడించి సీఎస్కే యాజమాన్యం.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడింది చెన్నై. ఇందులో 6 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. కేవలం 2 మ్యాచ్ లలో గెలుపొందింది.
ఇక మిగిలిన ఏడు మ్యాచ్ లకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహించనున్నట్ల తెలిపింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
తాను కెప్టెన్సీ భారం మోయలేక పోతున్నట్లు తెలిపాడు జడేజా. బ్యాటింగ్ , బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో విఫలమయ్యాడు. దాంతో తట్టుకోలేక రిజైన్ చేశాడు.
Also Read : మళ్లీ మెరిసిన జోస్ బట్లర్