Dil Raju : ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తా

నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Dil Raju : ప్ర‌ముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు (వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉన్నారు. గ‌తంలో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌తో ట‌చ్ లో ఉన్నారు దిల్ రాజు(Dil Raju). ఆయ‌న‌కు అంద‌రితో స‌త్ సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న స్వ‌స్థలం తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లా. ఇటీవ‌ల బ‌ల‌గం తీశాడు. అంత‌ర్జాతీయ ప‌రంగా ఏ సినిమాకు రాన‌న్ని అవార్డులు, పుర‌స్కారాలు ల‌భించాయి.

Dil Raju Comments

తాజాగా ఆయ‌న రాజ‌కీయాల గురించి, పార్టీల గురించి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. తాను ఏ పార్టీ లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. తాను అన్ని పార్టీల‌కు చెందిన వాడినంటూ పేర్కొన్నారు. అయితే ఏ పార్టీ నుంచి బ‌రిలో ఉన్నా ఎన్నిక‌ల్లో గెలుస్తానంటూ స్ప‌ష్టం చేశారు దిల్ రాజు.

ఇప్ప‌టికే సినీ రంగానికి చెందిన దివంగ‌త ఎన్టీ రామారావు సీఎంగా ప‌ని చేశారు. మోహ‌న్ బాబు ఎంపీగా ఉన్నారు. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించారు. పృథ్వీ రాజ్ టీటీడీ చైర్మ‌న్ గా ప‌ని చేశారు. సినీ రంగానికి చెందిన హాస్య న‌టులు ఆలీ, ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ మురళి ఏపీ లో కీల‌క‌మైన ప‌ద‌వుల‌లో కొన‌సాగుతున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ లో విలీనం చేశారు .ఆ త‌ర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ప్ర‌స్తుతం సినిమాల‌లో న‌టిస్తున్నారు. ఇక జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు.

Also Read : TS DGP Anjani Kumar : శ‌భాష్ తెలంగాణ పోలీస్ – డీజీపీ

Leave A Reply

Your Email Id will not be published!