Dilip Vengsarkar : కోహ్లీకి రెస్ట్ ఇవ్వ‌డం త‌ప్పుడు సంకేతం

మాజీ కెప్టెన్ వెంగ్ స‌ర్కార్ కామెంట్స్

Dilip Vengsarkar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ స‌ర్కార్(Dilip Vengsarkar) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీని రెస్ట్ పేరుతో ప‌క్క‌న పెట్ట‌డంపై తీవ్రంగా మండిప‌డ్డాడు.

ఇది పూర్తిగా త‌ప్పుడు సంకేతం వెళుతుంద‌ని పేర్కొన్నాడు. ఎందుకు రెస్ట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా వెస్టిండీస్ తో జ‌రిగే వ‌న్డే, టి20 సీరీస్ ల కోసం భార‌త జ‌ట్టులో నుంచి విరాట్ కోహ్లీని త‌ప్పించారు.

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఈ త‌రుణంలో కోహ్లీ(Virat Kohli) ఉంటాడో ఉండ‌డో అన్న అనుమానం నెల‌కొంది. గ‌త నాలుగేళ్ల కాలంలో కోహ్లీ ఒక్క సెంచ‌రీ చేయ‌లేక పోయాడు.

ప్ర‌ధానంగా ట‌న్నుల కొద్దీ ప‌రుగులు చేసిన ఈ క్రికెట్ దిగ్గ‌జం ఇప్పుడు ఫోర్లు, సిక్స‌ర్లు కొట్టేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. విచిత్రం ఏమిటంటే వికెట్ ను కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

ఇంగ్లండ్ సీరీస్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇబ్బందిక‌రంగా మారింది. మెల మెల్లగా విరాట్ కోహ్లీని త‌ప్పిస్తున్నార‌నే అనుమానం క‌లుగుతోంది క్రీడాభిమానుల్లో. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు వెంగ్ స‌ర్కార్(Dilip Vengsarkar).

ఆయ‌న కోహ్లీని ప‌క్క‌న పెట్టాల‌ని అనుకోవ‌డం ఎ రాంగ్ సిగ్న‌ల్ అంటూ పేర్కొన్నాడు. విచిత్రం ఏమిటంటే కోహ్లీని తొల‌గించారా లేక విశ్రాంతి తీసుకుంటున్నాడా అన్న‌ది అధికారికంగా బీసీసీఐ చెప్ప‌క పోవ‌డాన్ని నిల‌దీశాడు దీలీప్ వెంగ్ స‌ర్కార్.

ప్ర‌స్తుతం వెంగీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : విండీస్ తో భార‌త్ యుద్ధానికి సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!