Dimple Yadav Win : డింపుల్ యాదవ్ రికార్డ్ విక్టరీ
నేతాజీకి..ప్రజలకు అంకితం
Dimple Yadav Win : ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్(Dimple Yadav Win) అద్భుత విజయం సాధించింది. భారీ మెజారిటీతో గెలుపొందడం ఆ పార్టీకి ఊరట కలిగించింది. ఇదిలా ఉండగా తమ పార్టీకి చెందిన ఆజం ఖాన్ కోటను బద్దలు కొట్టారు సీఎం యోగి. అక్కడ బీజేపీకి చెందిన ఆకాశ్ సక్సేనా విజయం సాధించాడు.
ఇక ఇవాళ జరిగిన ఫలితాల్లో మెయిన్ పురి లోక్ సభ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. తన మామ, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఖాళీ ఏర్పడింది.
ఇదిల ఉండగా అఖిలేష్ యాదవ్ కు మేనమామ అయిన శివపాల్ యాదవ్ కు మాజీ సన్నిహితుడైన భారతీయ జనతా పార్టీకి చెందిన రఘురాజ్ సింగ్ షాక్యా బరిలో ఉన్నారు. ఆయన గట్టి పోటీ ఇచ్చారు. తొలి రౌండ్ లో కొంత అనుమానం వ్యక్తం అయినప్పటికీ ఆ తర్వాత రౌండ్ రౌండ్ కు ఓట్ల శాతం పెరుగుతూ పోయింది.
డింపుల్ యాదవ్ తన సమీప బీజేపీ అభ్యర్థిపై ఏకంగా 2 లక్షల 80 వేల భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇది ఓ రికార్డు అని చెప్పక తప్పదు. విజయం సాధించిన అనంతరం డింపుల్ యాదవ్(Dimple Yadav Win) మీడియాతో మాట్లాడారు. ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన మోయిన్ పురి నియోజకవర్గ ప్రజలందరికీ రుణ పడి ఉంటానని అన్నారు.
అంతే కాదు ఈ గెలుపు తనది కాదని మీ అందరిదన్నారు. ఈ విజయాన్ని ప్రజలకు, తన దివంగత నేత , మామ ములాయం సింగ్ యాదవ్ కు అంకితం ఇస్తున్నానని చెప్పారు డింపుల్ యాదవ్.
Also Read : కేంద్ర సర్కార్ తీరుపై ‘సుప్రీం’ సీరియస్