Dinesh Karthik : భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో రవీంద్ర జడేజా దమ్మున్న ప్లేయర్ అంటూ కితాబు ఇచ్చాడు.
ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడని అతడి లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్ గా , అవసరమైన సమయంలో కీలకమైన ఫినిషర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడని అన్నాడు.
అటు పరుగులు తీయడంలో ఇటు వికెట్లు పడగొట్టడంలో రవీంద్ర జడేజా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని ప్రశంసించాడు. మైదానంలో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడని తెలిపాడు.
అయితే సఫారీ టూర్ లో రవీంద్ర లేక పోవడం ప్రధాన లోపంగా కనిపించిందన్నాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik ). అటు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లలో ఇటు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లలో సైతం సత్తా చాటాడని స్పష్టం చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడిని వాడు కోవడంలో, వెన్ను తట్టి ప్రోత్సహించడంలో స్కిప్పర్ ధోనీ పాత్ర గొప్పదన్నాడు.
ప్రత్యేకించి రవీంద్ర జడేజా ఆరో ప్లేస్ కు సరిగ్గా సరి పోతాడని ప్రధానంగా హర్షల్ పటేల్ ను ఉతికి ఆరేసిన విషయాన్ని మరిచి పోతే ఎలా అని మరోసారి గుర్తు చేశాడు దినేశ్ కార్తీక్(Dinesh Karthik ).
ఇదిలా ఉండగా మోకాలికి తీవ్ర గాయం కావడంతో రవీంద్ర జడేజా ఆటకు దూరమయ్యాడు. దీంతో అతడిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ విండీస్ టూర్ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు.
Also Read : వెస్టిండీస్ టీ20, వన్డే జట్ల ఎంపిక