Dinesh Kartik IPL 2022 : దినేష్ కార్తీక్ జోర్దార్ ఇన్నింగ్స్
పటిదార్ తో కలిసి భారీ స్కోర్
Dinesh Kartik IPL 2022 : కీలకమైన ఐపీఎల్ ఎలిమినేటర్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఊహించని రీతిలో ప్లే ఆఫ్స్ ఛాన్స్ దక్కించుకున్న ఈ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది.
తనకు ఎదురే లేదని చాటింది. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ సాధించింది. కేవలం 4 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 207 రన్స్ టార్గెట్ ముందుంచింది.
లక్నో సూపర్ జెయింట్స్ పై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రజత్ పటిదార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట్లోనే వికెట్ కోల్పోయినా ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ.
మైదానంలోకి వచ్చిన రజత్ పటిదార్ మాత్రం చెలరేగి పోయాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన స్టార్ ఫినిషర్ గా పేరొందిన దినేశ్ కార్తీక్(Dinesh Kartik IPL 2022) మరోసారి తన సత్తా ఏమిటో చాటాడు.
పటిదార్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 23 బంతులు మాత్రమే ఆడాడు. 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 37 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇక రజత్ పాటిదార్ చివరి దాకా ఉన్నాడు.
112 రన్స్ చేశాడు. ఇందులో 12 ఫోర్లు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఒక రకంగా ఈ మ్యాచ్ ఆర్సీబీది కాదు రజత్ పటిదార్ దేనని చెప్పక తప్పదు. అంతలా జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
ఐపీఎల్ మెగా రిచ్ టోర్నీలో అద్భుత విజయాలు నమోదు చేస్తూ ప్లే ఆఫ్స్ కు చేరి..ఎలాగైనా సరే టైటిల్ గెలవాలని అనుకున్న కేఎల్ రాహుల్ ఆశలపై నీళ్లు చల్లింది ఆర్సీబీ.
Also Read : వీడు మామూలోడు కాదు మగాడు