Director K Vasu : డైరెక్ట‌ర్ కె వాసు క‌న్నుమూత

టాలీవుడ్ లో విషాదం

Director K Vasu : తెలుగు సినిమా రంగంలో ఒక‌రి వెంట మ‌రొక‌రు చ‌ని పోతున్నారు. ఇక చాలంటూ వెళ్లి పోతున్నారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వాసు(Director K Vasu) క‌న్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెల‌కొంది. వారం రోజుల వ్య‌వ‌ధిలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ క‌న్నుమూశారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ బాబు వెళ్లి పోయారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు కె. వాసు మ‌ర‌ణం క‌లిచి వేసింది.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు ద‌ర్శ‌కుడు. దీంతో శుక్ర‌వారం సాయంత్రం ఫిలిం న‌గ‌ర్ లోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. డైరెక్ట‌ర్ కె. వాసు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. కె. వాసు సినీ రంగంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు. ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవిని తెలుగు సినిమా తెర‌కు ప‌రిచయం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంది. ఆ త‌ర్వాత కోత‌ల రాయుడు, తోడు దొంగ‌లు, అల్లుళ్లు వ‌స్తున్నారు సినిమాల‌ను తీశాడు.

అంతే కాదు హాస్య న‌ట చ‌క్ర‌వ‌ర్తిగా పేరు పొందిన బ్ర‌హ్మానందంను హీరోగా పెట్టి తీశారు డైరెక్ట‌ర్ కె. వాసు. జోక‌ర్ మామ సూప‌ర్ అల్లుడు సినిమా తీశారు. దీనికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌ముఖ న‌టుడు విజయ చంద‌ర్ తో సాయిబాబాగా న‌టింప చేశారు. శ్రీ షిరిడీ సాయిబాబా మ‌హత్యం సినిమాను తీశారు కె. వాసు. చివ‌ర‌గా న‌టులు శ్రీ‌కాంత్, ప్ర‌భు దేవాల‌తో ఇంట్లో శ్రీ‌మ‌తి వీధిలో కుమారి చిత్రాన్ని తీశారు. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా త‌న‌ను వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసిన వాసు మృతికి తీవ్ర సంతాపం తెలిపారు చిరంజీవి.

Also Read : CM YS Jagan

Leave A Reply

Your Email Id will not be published!