Trivikram Srinivas : త్రివిక్ర‌మ్ ప‌రేషాన్ కారుకు ఫైన్

రూల్స్ అతిక్ర‌మించిన డైరెక్ట‌ర్

Trivikram Srinivas  : ఆయ‌న మాట‌ల మాంత్రికుడు. జీవితం, స‌మాజం గురించి గొప్ప‌గా చెప్ప‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అంతే కాదు మాట‌ల తూటాలు పేల్చ‌డంలో దిట్ట‌.

జీవిత స‌త్యాలు వ‌ల్లె వేయ‌డంలో, అద్భుత‌మైన సందేశాలు ఇస్తూ ముందంజ‌లో ఉన్నారు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్(Trivikram Srinivas ). ఎదుటి వారికి నీతులు చెప్పేందుకే ఉంటాయ‌ని త‌మ‌కు వ‌ర్తించ‌వ‌ని నిరూపించారు స‌ద‌రు ద‌ర్శ‌కుడు. ఎవ‌రు ప‌డితే వాళ్లు బ్లాక్ ఫిల్మ్స్ వాడ‌డం మామూలై పోయింది.

ఇప్ప‌టికే వాటిని తొల‌గిస్తున్నారు పోలీసులు. ఇప్ప‌టికే ప‌లువురికి షాక్ ఇచ్చారు కూడా. ఇది తెలిసి కూడా ఈ డైరెక్ట‌ర్ త‌న‌కేమీ కాద‌నుకుంటూ రోడ్డుపైకి వ‌చ్చారు ద‌ర్జాగా. దీంతో పోలీసులు ఆపారు.

బ్లాక్ ఫిల్మ్ ను తొల‌గించారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా ఉన్నారు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. దీంతో ఆయ‌న కారుకు పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీ హిల్స్ లో త‌నిఖీలు య‌ధావిధిగా చేప‌ట్టారు.

అటు వైపు వ‌చ్చిన త్రివిక్ర‌మ్ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆయ‌న కారుకు బ్లాక్ పిల్మ్ ఉన్న‌ట్లుగా గుర్తించారు. రూ. 700 ఫైన్ విధించారు. బ్లాక్ ఫిల్మ్ ల‌ను కొంద‌రు మాత్ర‌మే వాడాల్సి ఉంటుంది.

ఇదే సమ‌యంలో రూల్స్ ను వ‌యొలేట్ చేస్తూ వ‌స్తున్న టాలీవుడ్ ప్ర‌ముఖులు అల్లు అర్జున్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ , మంచు మ‌నోజ్ , క‌ళ్యాణ్ రామ్ కార్ల‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.

ఈ ఫైన్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ వ్య‌వ‌హారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : శ్రీలీల రెమ్యూన‌రేష‌న్ స‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!