DK Shiva Kumar : సోనియాను కలిసిన డీకే శివకుమార్
రాహుల్ గాంధీతో చర్చలు
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం , పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) సీపీపీ చైర్ పర్సన్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీని ఢిల్లీలో కలుసుకున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో భారీ మెజారిటీని సాధించింది పార్టీ. ఇది ఊహించని విజయం. మొత్తం 224 సీట్లకు గాను 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించి సోనియా గాంధీ కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
అనారోగ్యం కారణంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేక పోయారు సోనియా గాంధీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే హాజరయ్యారు.
ఈ సందర్భంగా కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా కొలువు తీరారు. వీరితో పాటు యుటీ ఖదీర్ కర్ణాటక అసెంబ్లీ సభాపతిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా మరికొందరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు సీఎం, డిప్యూటీ సీఎం.
ఇద్దరూ హస్తిన బాట పట్టారు ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఇతర నేతలను కలుసుకున్నారు. అనంతరం ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా డీకేను ప్రత్యేకంగా అభినందించారు మేడం.
Also Read : Congress Slams