DK Shiva Kumar : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ భేష్
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్
DK Shiva Kumar : హైదరాబాద్ – కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తు పోయేలా చేశారు. నిత్యం ఉప్పు నిప్పు లాగా రాష్ట్రంలో టీపీసీసీ, బీఆర్ఎస్ కొనసాగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గా మారిన తరుణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిన్న, ఇవాళ కొనసాగుతోంది.
DK Shiva Kumar Praises
పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభను చేపట్టింది టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి తరలి వచ్చారు పెద్ద ఎత్తున.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) తో పాటు ఇతర కీలక మంత్రులు కూడా విచ్చేశారు. ఇందులో భాగంగా హైదరాబద్ లోని జవహర్ నగర్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టూర్ లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
అక్కడి నుండి డంపింగ్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ చెత్తతో తయారు చేసే విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించడం పార్టీ శ్రేణులను ఆశ్చర్య పోయేలా చేసింది.
Also Read : Ram Gopal Varma : బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపడితే బెటర్