Ram Gopal Varma : బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపడితే బెటర్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma : హైదరాబాద్ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు , నారా లోకేష్ భార్య, నందమూరి బాలకృష్ణ తనయురాలు నారా బ్రాహ్మణిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ట్విట్టర్ వేదికగా ఆదివారం ఆయన స్పందించారు. ప్రస్తుతం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీమ్ లో రూ. 371 కోట్లు పక్కదారి పట్టాయని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది. నంద్యాలలో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది.
Ram Gopal Varma Comments Viral
ఏపీ సీఐడీ 10 గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు 20 ప్రశ్నలు సంధించారు. కానీ ఇందులో ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాట వేశారంటూ ఆరోపించింది ఏపీ సీఐడీ.
ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టడంతో చంద్రబాబు తరపున సుప్రీం ప్రముఖ లాయర్ లూథ్రా వాదించినా చివరకు కాపాడ లేక పోయారు. ఏసీబీ కోర్టు జడ్జి హిమ బిందు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలో నారా లోకేష్, బాలకృష్ణ కంటే నారా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బెటర్ అంటూ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సూచించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Nadendla Manohar : సమన్వయ కమిటీ చైర్మన్ గా నాదెండ్ల
