‘పోలవరం’ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎస్ఎంఆర్ఎస్ బృందం
పరీక్షలు జరిపిన అనంతరం మెయిల్ అధికారులతో టీం సమీక్ష
నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా లోని పోలవరం ప్రాజెక్టులోని ఎర్త్-కం-రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంల సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం వరుసగా రెండవ రోజు తమ క్షేత్రస్థాయి పరిశీలనలను కొనసాగించింది.నీరు ఇంకే స్వభావం తో పాటు నేల దృఢత్వాన్ని అంచనా వేసేందుకు డ్యామ్ పరిధిలోని 350 మీటర్ల నుండి 800 మీటర్ల మధ్య గల వివిధ ప్రాంతాలలో సీఎస్ఆర్ఎంస్ నిపుణులు హరేంద్ర ప్రకాష్, దీపముద్ర నాయక్, గౌరవ్ పాండే తదితరులు పరీక్షలు నిర్వహించారు. ఈ బృందం ప్రాజెక్టులో వినియోగిస్తున్న మట్టి, రాతి పదార్థాల నాణ్యతను పరిశీలించడంతో పాటు, నిర్మాణ స్థలంలో తేమ శాతాన్ని అంచనా వేసింది. పరిశీలనలో భాగంగా సాంద్రత , పారగమ్యత , కోర్ కు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారు.
ఈసీఆర్ఎఫ్ ప్రాంతం గుండా నీటి ప్రవాహ వేగాన్ని నిపుణులు కొలిచారు, అలాగే నేల దృఢత్వం , ఇతర లక్షణాలను నిర్ధారించడానికి క్షేత్రస్థాయి పరీక్షలు చేపట్టారు. అక్కడి నుండి సేకరించిన నమూనాలను పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని ప్రయోగశాలలో పరీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించి సీఎస్ఎంఆర్ఎస్ బృందానికి అవసరమైన సాంకేతిక వివరాలను అందించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలకు సహకరించారు. ఈ కార్యక్రమంలో మెయిల్ జనరల్ మేనేజర్ ఎ. గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు మురళి పమ్మి , గుట్టపాటి శంకరయ్య, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నిర్మల, శ్రీనివాస్, శేఖర్ బాబు, శివప్రసాద్ , మల్లికార్జున పాల్గొన్నారు. అనంతరం అధికారులు పరీక్షల పురోగతిని , జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలను కూడా సమీక్షించారు.
