వారణాసి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. సమర్థవంతమైన నాయకత్వంతో భారత్ తిరుగులేని శక్తిగా నిలిచిందన్నారు. ఇటీవలే బ్రిక్స్ సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. వివిధ దేశాల అధినేతలు మన ప్రధాని నాయకత్వంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా దేశంపై దాడి చేయాలంటే భయపడేలా చేశారు… ఆపరేషన్ సింధూర్ ద్వారా ధీటైన జవాబుతో భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్‌ను అభినందిస్తున్నాను. నేను కూడా వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొన్నాను.. నన్ను నక్సలైట్లు టార్గెట్ చేశారు..వారికి నేనూ బాధితుణ్ణే. కానీ ఇప్పుడు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపారు. దటీజ్ నరేంద్ర మోదీ. దేశం మొత్తానికి ఒకే పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే. దేశంలో కనెక్టివిటీ పెంచారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలు దేశంలో ఉన్నాయి.. కానీ దేశాభివృద్ధి, ఆత్మనిర్భరత అనేదే మన లక్ష్యం. సుస్థిరత వల్లే ఇది సాధ్యమవుతుంది.
సుస్థిరత వల్ల నమ్మకం పెరుగుతుంది.. నమ్మకం వల్ల పెట్టుబడులు వస్తాయి.. పెట్టుబడులు వల్ల ఉద్యోగాలు సమకూరుతాయి.. అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.. బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. నదుల అనుసంధానం మాత్రమే ఇంకా పెండింగులో ఉంది.ఈ నదుల అనుసంధానం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే సాధ్యమవుతుంది. బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంసంధానం చేస్తే భారత్ అన్ స్టాపబుల్. 25 ఏళ్ల పాటు కంటిన్యూగా పాలనలో ఉండడం మామూలు విషయం కాదు. దేశంలో.. ప్రపంచంలో కూడా ఈ విధంగా రాజ్యాంగ పదవిలో ఉండడం సాధ్యం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ సమాజాన్ని చదివారు… చాలా నేర్చుకున్నారు.దానికి అనుగుణంగా పాలన చేపట్టారు. 2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ అనే కార్యక్రమం నిర్వహించారు.. ఇప్పుడది గ్లోబల్ బ్రాండ్ గా మారింది. నరేంద్ర మోదీ సారధ్యంలో అభివృద్ధి పట్టణాలకే కాదు… గ్రామీణ ప్రాంతాలకు చేరింది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్ ఇదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం అని ముఖ్యమంత్రి అన్నారు.
