DK Shiva Kumar : ఇందిర‌మ్మ‌ క్యాంటీన్ లో డీకే శివ‌కుమార్

సామాన్యుల‌తో భోంచేసిన డిప్యూటీ సీఎం

DK Shiva Kumar : క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం సామాన్యులు, పేద‌లకు మేలు చేకూర్చేలా కృషి చేస్తోంది. ఇటీవ‌లే ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన ఆ పార్టీ ఐదు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింది. సీఎం, డిప్యూటీ సీఎంలుగా సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రూ ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌ని ఇందిర‌మ్మ క్యాంటీన్ల‌ను నిర్వ‌హిస్తోంది.

ఈ క్యాంటీన్లు వేలాది మంది ఆక‌లిని తీరుస్తున్నాయి. ఇందులో భాగంగా ఎలా నిర్వ‌హిస్తున్నార‌నే దానిపై స్వ‌యంగా రంగంలోకి దిగారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. మ‌గాడి రోడ్డు ప‌రిస‌ర ప్రాంతాల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. అంత‌కు ముందు చొక్క సంద్ర లో ఏర్పాటు చేసిన ఇందిర‌మ్మ క్యాంటీన్ ను సంద‌ర్శించారు. అక్క‌డ సామాన్యుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు డీకే శివ‌కుమార్. ఎలా ఉందంటూ అడిగారు. ఇంకా ఏమేం కావాలో చెప్పాల‌ని కూడా డిప్యూటీ సీఎం కోరారు.

ఇందిర‌మ్మ క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఆక‌లిని తీర్చడంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని డిప్యూటీ సీఎం స్ప‌ష్టం చేశారు. క్యాంటీన్ లో భోజ‌నం చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇంకా అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని ఇందిర‌మ్మ క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Kuchukulla Damodar Reddy : బీఆర్ఎస్ కు కూచుకుళ్ల ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!