DK Shivakumar : మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది – డీకే
జూనియర్ హాకీ ఛాంపియన్స్ కు అభినందన
DK Shivakumar : జపాన్ వేదికగా జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు చెందిన అమ్మాయిలు అదుర్స్ అనిపించేలా చేశారు. గత నాలుగుసార్లు ఆసియా కప్ టోర్నీని కైవసం చేసుకుంటూ వచ్చిన దక్షిణ కొరియాకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. విస్తు పోయేలా చేశారు.
ఆట పరంగా తొలి సెషన్ లో భారత్, సౌత్ కొరియా చెరో గోల్ చేసి సమానంగా నిలిచాయి. కానీ రెండో సెషన్ లో భారత అమ్మాయిలు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసేందుకు. ఉన్నట్టుండి మరో గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 2-1 తేడాతో దక్షిణ కొరియాను మట్టి కరిపించింది భారత జట్టు.
దీంతో దేశ వ్యాప్తంగా సంబురాలు అంబురాన్ని తాకాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆసియా కప్ ను సాధించిన భారత జట్టును అభినందనలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా భారత దేశ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ అమ్మాయిల ప్రతిభా పాటవాలను కొనియాడారు. మీరు దేశానికి గర్వ కారణంగా నిలిచారని కొనియాడారు.
మరో వైపు కర్ణాటక డిప్యూటీ సీఎం , ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) ట్విట్టర్ వేదికగా సోమవారం స్పందించారు. అమ్మాయిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. నేటి యువతీ యువకులకు స్పూర్తి దాయకంగా నిలిచారంటూ ప్రశసంలతో ముంచెత్తారు.
Also Read : AP CM YS Jagan : ఘనంగా జగనన్న విద్యా కానుక