DK Shivakumar : అసెంబ్లీ బ‌రిలో డీకే సోద‌రుడు

ప్ర‌క‌టించిన కేపీసీసీ చీఫ్ డీకేఎస్

DK Shivakumar Brother : క‌ర్ణాటక ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (కేపీసీసీ) చీఫ్ డీకే శివ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ , మే నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ , కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అంటూ పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం లో నిమ‌గ్నం అయ్యాయి. ఇక శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో రామ‌న‌గ‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న సోద‌రుడు డీకే సురేష్ బ‌రిలో ఉంటార‌ని వెల్ల‌డించారు.

హైక‌మాండ్ నుంచి మీకేమైనా సూచ‌న‌లు వ‌చ్చాయా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు డీకే శివ‌కుమార్ స్పందించారు. నేను దానిని తిర‌స్క‌రించ లేను..అటువంటి ప్ర‌తిపాద‌న ఉంద‌న్నారు. కానీ దాని గురించి ఇంకా చ‌ర్చించ లేద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా బెంగ‌ళూరు రూర‌ల్ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్న డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేష్ ను ఎన్నిక‌ల బ‌రిలోకి (DK Shivakumar Brother) దించాల‌నేది త‌మ నిర్ణ‌యం కాద‌న్నారు. కేవ‌లం హైక‌మాండ్ సూచించిన మేర‌కే దీనిపై స్పందించిన‌ట్లు తెలిపారు.

మంగ‌ళ‌వారం కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయ‌న‌ను బ‌రిలోకి దింపాల‌ని నాకు సందేశం మాత్రం వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే ఈ ఆలోచ‌నను తాను ప్ర‌తిపాదించ లేద‌ని స్ప‌ష్టం చేశారు కేపీసీసీ చీఫ్‌. సురేష్ తో పాటు పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌కర్త‌లతో స‌మావేశం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

క‌ర్ణాట‌క నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ సురేష్. ఒక‌వేళ ఆయ‌న బ‌రిలోకి దిగితే మాజీ సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార స్వామిని పోటీ చేయ‌నున్నారు.

Also Read : ప్ర‌ధాని మోదీ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!