Senthil Balaji Arrest : మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్

ఛాతిలో నొప్పితో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Senthil Balaji Arrest : కేంద్రంపై సీరియ‌స్ కామెంట్స్ చేసిన సీఎం స్టాలిన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా ప‌ని చేస్తున్న సెంథిల్ బాలాజీని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ బుధ‌వారం తెల్ల వారుజామున అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండ‌గా ఆయ‌న త‌న‌కు ఛాతిలో నొప్పి వ‌స్తోందంటూ ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా ఇదంతా నాట‌క‌మ‌ని బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై కొట్టి పారేశారు.

జాబ్ స్కాంలో మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన‌ట్లు ఈడీ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా చెన్నై లోని సెంథిల్ నివాసంతో పాటు సోద‌రుడు అశోక్ ఇల్, క‌రూర్ లోని ప‌లు ప్ర‌దేశాల‌లో 18 గంట‌ల‌కు పైగా ఈడీ సోదాలు నిర్వ‌హించింది.

ఇదిలా ఉండ‌గా 2011-16లో ఏఐఏడీఎంకే ప్ర‌భుత్వ హ‌యాంలో సెంథిల్ బాలాజీ(Senthil Balaji) ర‌వాణ శాఖా మంత్రిగా ప‌ని చేశారు. ఉద్యోగాల కుంభ‌కోణం ఆనాడు బ‌య‌ట ప‌డింది. ఇటీవ‌ల రాష్ట్రంలో ఎన్నిక‌ల సంద‌ర్బంగా బాలాజీ అన్నాడీఎంకే నుంచి డీఎంకేలోకి జంప్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కొలువు తీరారు. మంత్రిగా ఉన్న బాలాజీని పీఎంఎల్ఏ రూల్స్ కింద అరెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

ఛాతిలో నొప్పి రావ‌డంతో సెంథిల్ బాలాజీని చెన్నై లోని ప్ర‌భుత్వ మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో ఉన్న బాలాజీని క‌లిసేందుకు వెళ్లారు ఉద‌య‌నిధి స్టాలిన్ , సుబ్ర‌మ‌ణియ‌న్ , ఇవి వేలు, రేగుప‌తి. క‌లిసేందుకు ఒప్పు కోలేదు ఈడీ.

Also Read : Priyank Kharge : ఐటీ రంగంపై ప్రియాంక్ ఖ‌ర్గే ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!