Edappadi Palaniswami : ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు
ఎడాపొడి పళనిస్వామి కామెంట్స్
Edappadi Palaniswami : పవర్ కోల్పోయిన మాజీ సీఎం ఎడాపొడి పళని స్వామి(Edappadi Palaniswami) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా డీఎంకే సర్కార్ పై బాంబు పేల్చారు. ఆ పార్టీకి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.
ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఆ ఎమ్మెల్యేల జాబితా తమ వద్ద ఉందని కానీ నియమ నిబంధనల మేరకు బయటకు చెప్పకూడదన్నారు.
ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకే పార్టీతో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఈపీఎస్.
అలాంటిది ఏమీ లేదని , ఆ పార్టీకి చెందిన వారే తమతో టచ్ లో ఉన్నారని చెప్పడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా కేంద్రంలోని మోదీతో అన్నాడీఎంకే స్నేహంగా ఉంటోంది.
ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిది ఏళ్ల కాలంలో ఎనిమిది రాష్ట్రాలను కూల్చి వేసింది. ఇదే క్రమంలో ఇక మిగిలింది జార్ఖండ్ , ఛత్తీస్ గఢ్ , పశ్చి మ బెంగాల్ , కేరళ, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ , రాజస్తాన్ రాష్ట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇదిలా ఉండగా రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది. ఇక జార్ఖండ్ లో జేఎంఎం, తమిళనాడులో డీఎంకే, పంజాబ్ , ఢిల్లీలో ఆప్ కొలువు తీరి ఉన్నాయి.
ఇదే క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీలు తలుచుకుంటే డీఎంకే సర్కార్ ను కూల్చడం ఓ లెక్కా అన్నారు.
ఈ తరుణంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ సీఎం ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.
Also Read : సెంటర్ ఫర్ రీసెర్చ్ పాలసీలో ఐటీ దాడులు