Kanimozhi Rahul Yatra : రాహుల్ గాంధీ యాత్రలో కనిమొళి
అడుగులో అడుగు వేసిన డీఎంకే ఎంపీ
Kanimozhi Rahul Yatra : డీఎంకే ఎంపీ కనిమొళి ఇవాళ హాట్ టాపిక్ గా మారారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో జత కట్టారు. కనిమొళి(Kanimozhi) అడుగులో అడుగు వేశారు. సందడి చేశారు. ఆమెతో పాటు వేలాది మంది యాత్రలో నడిచారు. ప్రస్తుతం హర్యానాలో యాత్ర కొనసాగుతోంది.
ఇవాల్టితో మొదటి దశ యాత్ర ముగుస్తుంది. రెండవ దశలో జనవరి 6న పానిపట్ జిల్లా లోని సనోలి ఖుర్ష్ వద్ద ఉత్తర ప్రదేశ్ నుండి హర్యానా లోకి తిరిగి ప్రవేశిస్తుంది. రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కనిమొళి. ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమెతో పాటు దీపిందర్ హూడా కూడా పాల్గొన్నారు.
హర్యానా లో మూడోది, చివరి రోజు సోహ్నా లోని ఖేర్లీ లాలా నుండి ఇవాళ తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఉదయం చలి తీవ్రత ఉన్నప్పటికీ డీఎంకే ఎంపీ కనిమొళి కూడా రాహుల్ గాంధీ(Kanimozhi Rahul Yatra) కలిసి నడవడం మరింత ఆసక్తిని రేపింది. పార్టీ పరంగా కాంగ్రెస్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇదిలా ఉండగా కనిమొళితో పాటు హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా, సీనియర్ నాయకులు రణ దీప్ సింగ్ సూర్జే వాలా, కుమారి సెల్జా కూడా పాల్గొన్నారు. ఈ యాత్ర ఫరీదాబాద్ జిల్లా గుండా పఖల్ గ్రామం, పాలి చౌక్ , గోపాల్ గార్డెన్ మీదుగా కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే 100 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు రాహుల్ గాంధీ. ఆయన ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ లలో పూర్తి చేసుకుంది.
Also Read : మోదీ నిర్వాకం పెరిగిన పేదరికం