Dravid Vihari : హైదరాబాద్ కు చెందిన బ్యాటర్ హనుమ విహారి పై అందరి ఫోకస్ నెలకొంది. మొదటి టెస్టులో చాన్స్ దక్కని విహారికి రెండో టెస్టులో అనూహ్యంగా అవకాశం లభించింది. వచ్చిన చాన్స్ ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు విహారి.
రెండో ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. మరో వైపు ఈనెల 11న జరిగే మూడో టెస్టులో విహారికి(Dravid Vihari) చాన్స్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ నెలకొంది.
పరోక్షంగా విహారికి తుది జట్టులో చోటు ఖాయం కాదని కుండ బద్దలు కొట్టాడు. ఎందుకంటే వెన్ను నొప్పి గాయం కారణంగా టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు కోవడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ టీమ్ కు సారథ్యం వహించాడు.
అంత బాగా ఆడినప్పటికీ హనుమ విహారీతో పాటు శ్రేయస్ అయ్యర్ కు తుది టీంలో చోటు దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు. కోహ్లీ వస్తే విహారిని ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్న వేశాడు. పూర్తిగా పక్కన పెట్టడం ఖాయమేనని స్పష్టం చేశాడు.
వారిద్దరిలో ఆడగలమన్న ధైర్యం నెలకొందని దీంతో వారికి రాబోయే మ్యాచ్ లలో ఆడేందుకు వీలు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా తెలుగు వారికి ప్రతీసారి అన్యాయం జరుగుతోందంటూ క్రీడాభిమానులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తిగా ముంబై, ఢిల్లీ, నార్త్ వాళ్లకే ప్రయారిటీ ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
అయితే రవిశాస్త్రి విషయంలో ఆ అనుమానం నిజం కావచ్చేమో కానీ రాహుల్ కోచ్ గా ఉన్న సమయంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని మరికొందరు అంటున్నారు.
Also Read : చెలరేగిన జానీ బెయిర్ స్టో