Congress Chief Poll : అధ్యక్ష ప‌ద‌వి గాంధీ ఫ్యామిలీకేనా

పార్టీ నిర్ణ‌యాధికారం మేడంకే

Congress Chief Poll :  134 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏం జ‌రుగబోతోంద‌న్న ప్ర‌శ్న ఉదయిస్తోంది. ప్ర‌ధానంగా పార్టీ శ్రేణుల్లో. గ‌త కొంత కాలంగా నాన్చుతూ, వాయిదా వేస్తూ వ‌చ్చిన పార్టీ చీఫ్ ప‌ద‌వి ఎన్నిక ఎట్ట‌కేల‌కు(Congress Chief Poll) తేదీ ఖ‌రారైంది.

వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 17న ఇందు కోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేస్తున్నారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్. అక్టోబ‌ర్ 19న పూర్తిగా ఎన్నిక‌ల ఫ‌లితం తేల‌నుంది. ఎవ‌రు పార్టీ ప‌గ్గాలు చేప‌డ‌తార‌నేది స్ప‌ష్టం అవుతుంది.

అప్ప‌టి దాకా పార్టీలో ఎవ‌రు బ‌రిలో ఉంటార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మొత్తం 9,000 మంది కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఇప్ప‌టికే పార్టీలో అస‌మ్మ‌తి రాగం వినిపిస్తున్న వారంతా అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌ను స‌జావుగా, పూర్తి పార‌దర్శ‌క‌త‌తో నిర్వహించాల‌ని కోరుతున్నారు.

అది పెద్ద రాద్ధాంతానికి దారితీసింది. ఇదే స‌మ‌యంలో ఆయా రాష్ట్రాల అధినేత‌లు ముఖ్య స‌భ్యుల‌ను ఎంపిక చేసేందుకు తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధికే ప‌వ‌ర్స్ ఇవ్వాలంటూ సెప్టెంబ‌ర్ 20 లోపు తీర్మానాలు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ కోరిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ‌మైన ఓట‌మి చ‌వి చూసింది. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ రాహుల్ గాంధీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆనాటి నుంచి నేటి దాకా సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్ గా నెట్టుకుంటూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం పోటీ గాంధీ ఫ్యామిలీ నుంచి గాంధీయేత‌ర నేత‌ల నుంచి ఉండ‌నుంది.

సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు ప్ర‌జాస్వామ్యం క‌లిగిన పార్టీలో ఎవ‌రికి ప‌వ‌ర్స్ ఉంటాయ‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది.

Also Read : మా హ‌యాంలోనే పాల ఉత్ప‌త్తిలో టాప్

Leave A Reply

Your Email Id will not be published!