Amanatullah Khan Waqf Board : వ‌క్ఫ్ బోర్డు ఆస్తుల స్వాధీనం ఒప్పుకోం

ఢిల్లీ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ అమానుతుల్లా ఖాన్

Amanatullah Khan Waqf Board : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌క్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 123 స్థ‌లాల‌ను కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిపై ఢిల్లీ వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ , ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్(Amanatullah Khan Waqf Board) తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థ‌తుల్లో ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌క్ఫ్ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర స‌ర్కార్ ను అనుమ‌తించ‌బోమ‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ వ‌క్ఫ్ బోర్డుకు చెందిన మ‌సీదులు, ద‌ర్గాలు, శ్మ‌శాన వాటిక‌లు స‌హా 123 ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అమానుతుల్లా ఖాన్.

డిప్యూటీ ల్యాండ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫీస‌ర్ ఫిబ్ర‌వ‌రి 8న ఢిల్లీ వ‌క్ఫ్ బోర్డుకు లేఖ రాశారు. ఇందులో 122 ఆస్తుల‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను విముక్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. డీ నోటిఫైడ్ వ‌క్ఫ్ ఆస్తుల అంశంపై జ‌స్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలోని ఇద్ద‌రు స‌భ్యుల క‌మిటీ త‌న నివేదిక‌లో ఢిల్లీ వ‌క్ఫ్ బోర్డు నుండి ఎటువంటి ప్రాతినిధ్యం లేదా అభ్యంత‌రం రాలేద‌ని కేంద్రానికి చెందిన ఎల్ అండ్ డిఓ వెల్ల‌డించింది.

ఎల్ అండ్ డిఓ లేఖ ప్ర‌కారం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేర‌కు భార‌త ప్ర‌భుత్వం ఈ క‌మిటీని నియ‌మించింది. క‌మిటీ ముందు 123 ఆస్తుల‌కు సంబంధించి ఎటువంటి ప్రాతినిధ్యాన్ని లేదా అభ్యంత‌రాల‌ను దాఖ‌లు చేయ‌లేద‌ని తెలిపింది. దీంతో తాము ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది.

Also Read : పార్టీ గుర్తు ను అంగీక‌రించండి – ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!