RC Bhargava : ప్రభుత్వం వ్యాపారాలు నిర్వహించొద్దు – భార్గవ
మారుతీ సుజుకీ సంస్థ చైర్మన్ షాకింగ్ కామెంట్స్
RC Bhargava : మారుతీ – సుజుకీ సంస్థ చైర్మన్ ఆర్.సి. భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడాలని కానీ వ్యాపారాలు నిర్వహించ కూడదని కుండ బద్దలు కొట్టారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాలలో ఇటు వ్యాపార, వాణిజ్య వర్గాలలో. ప్రభుత్వ రంగ కంపెనీలు అసమర్థంగా ఉన్నాయని పేర్కొన్నారు.
పన్నులను విధించడం వల్ల పారిశ్రామిక వృద్ది అనేది సాధ్యం కాదని స్పష్టం చేశారు భార్గవ(RC Bhargava). స్వంత వృద్దికి నిధులు సమకూర్చేందుకు తగినంత మేర వనరులను ఉత్పత్తి చేయక పోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
ఒక వేళ ప్రభుత్వ రంగ కంపెనీలు వృద్ధి చెందాలంటే అన్ని వేళలా మద్దతు అవసరమన్నారు. మూల ధన పెట్టుబడుల కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు.
ఆర్.సి. భార్గవ జాతీయ మీడియాతో ఆదివారం మాట్లాడారు. ప్రభుత్బం వ్యాపారంలో ఉండకూడదనడంలో నాకు ఎటువంటి సందేహం లేదన్నారు. కానీ మార్గం లేదని కూడా చెప్పారు.
అప్పటి ప్రభుత్వ యాజమాన్యంలోని మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పరివర్తనను చూసిన తన అనుభవం ఆధారంగా ఈ విషయాన్ని తాను చెబుతున్నట్లు స్పష్టం చేశారు ఆర్. సి. భార్గవ(RC Bhargava).
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ కి జపాన్ కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన మెజారిటీ యాజమన్యం కలిగి ఉంది.
పారిశ్రామిక వృద్ధి అంతర్గత వనరుల ఉత్పత్తి నుండి రావాలని, ఒక సంస్థ తప్పనిసరిగా సంపదను సృష్టించాలన్నారు. అయితే సంపదను దోచుకునేది కాదన్నారు ఆర్.సి.భార్గవ.
Also Read : భారత దేశం సాయం మరువలేం