Deandra Dottin : ‘డాటిన్’ స్ట‌న్నింగ్ క్యాచ్ సెన్సేష‌న్

క‌రేబియ‌న్ ఉమిన్ మెస్మ‌రైజ్

Deandra Dottin  : ఓహ్ అద్భుత‌మైన క్యాచ్ కు వేదిక‌గా మారింది ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్. వెస్టిండీస్ కు చెందిన మ‌హిళా క్రికెట‌ర్ డియాండ్రా డాటిన్ (Deandra Dottin )క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టింది. చూస్తూ ఉండ‌గానే ఊహించ‌ని రీతిలో బంతిని ప‌ట్టుకుంది.

ఆమె అందుకున్న క్యాచ్ ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంగ్లండ్ కు చెందిన విన్ ఫీల్డ్ హిల్ నుండి డాటిన్ తీసుకున్న క్యాచ్ మ‌హిళ‌ల క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత అద్భుత‌మైన క్యాచ్ గా క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఓహ్ అద్భుతం అంటూ విండీస్ కెప్టెన్ తో పాటు ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ స్కిప్ప‌ర్ కూడా. ఒక‌వేళ ఆ బంతి గ‌నుక వ‌దిలేస్తే ఫోర్ పోయేది.

వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ వేదిక‌గా వెస్టిండీస్ , ఇంగ్లండ్ మ‌హిళా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.

విండీస్ కెప్టెన్ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. 225 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ ఉత్కంఠ పోరులో 7 ప‌రుగుల తేడాతో ఓడి పోయింది.

ఈ సంద‌ర్భంగా 9వ ఓవ‌ర్ లోని మొద‌టి బంతిని షామిలియా కానెల్ బౌల్డ్ చేయ‌గా విన్ ఫీల్డ్ బ్యాక్ వ‌ర్డ్ పాయింట్ వైపు క‌ట్ షాట్ ఆడింది. బంతి బ్యాట్ ను తాకిన‌ప్పుడు అంతా అది బౌండ‌రీ కి త‌గిలిన‌ట్లు అనిపించింది.

కానీ చిరుత లాంటి చ‌రుకుద‌నం , డేగ లాంటి క‌ళ్ల‌తో డాటిన్ ఎడ‌మ వైపు గాలి లోకి డైవ్ చేసి అందుకుంది. దీంతో విన్ ఫీల్డ్ హిల్ 27 బంతులు ఆడి 12 ప‌రుగులు చేసింది.

లేక పోయి ఉంటే భారీ ప‌రుగులు చేసి ఉండేది. గెలిచి ఉండేది. ప్ర‌స్తుతం డాటిన్ క్యాచ్ వైర‌ల్ గా మారింది.

Also Read : పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!