Draupadi Murmu : అట్టడుగు నుంచి అత్యున్నత స్థానం దాకా
కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు
Draupadi Murmu : ఒడిశాలోని ఆదివాసీ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. భారత దేశంలోనే అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందారు.
ఆమెకు 64 శాతం ఓట్లు వచ్చాయి. ప్రధానంగా విపక్షాల నుంచి 104 ఓట్లు కూడా రావడం ఆమె పట్ల కొందరికి ఉన్న గౌరవం కూడా కారణం కావచ్చు. పేదరికం నుంచి పైకి వచ్చారు.
మొదటగా జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. అనంతరం కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. భారతీ జనతా పార్టీలో కీలక పదవులు చేపట్టారు.
రాష్ట్రంలో రెండు సార్లు మంత్రి పదవిగా పని చేశారు. అనంతరం మోదీ కొలువు తీరాక 2015లో జార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు. ఊహించని రీతిలో రాష్ట్రపతి పదవికి ఎంపికయ్యారు.
ఈ మొత్తం ఎంపిక వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఉన్నారు. అట్టడుగు స్థానం నుంచి అత్యున్నత స్థానం దాకా తనను తాను ఆమె ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు.
ఎక్కడా ఆర్బాటాలు, హంగులు ప్రదర్శించ లేదు. తనకు ఓటు వేసిన వారికి వేయని వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఇక దేశంలోనే రాష్ట్రపతి పదవిని అలంకరించిన ద్రౌపది ముర్ము(Draupadi Murmu) అందరి కంటే వయస్సులో చిన్న వారు. ద్రౌపది ముర్ము చాలా బాధలు పడ్డారు.
కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ వాటిని చూసి ఏనాడూ చలించ లేదన్నారు ఒడిశా బీజేపీ మాజీ చీఫ్ మన్మోహన్ సమాల్. నిరాడంబరమైన జీవితాన్ని ఎక్కువగా ఇష్ట పడుతుంది ద్రౌపది ముర్ము. జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
2009-2015 మధ్య ఆరేళ్లలో తన భర్తను, ఇద్దరు కుమారులు, తల్లి, సోదరుడిని కోల్పోయారు ద్రౌపది ముర్ము. బ్రహ్మ కుమారీల ధ్యాన పద్దతుల్ని అనుసరిస్తారు ఆమె.
అయిన వారందరినీ పోగొట్టుకున్నప్పుడు ఏకాంతమే తనకు తోడుగా నిలిచిందన్నారు ద్రౌపది ముర్ము. కొడుకు మరణం నన్ను కోలుకోలేకుండా చేసిందన్నారు.
ఈనెల 21న నామినేట్ అయినప్పటి నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె దేశ వ్యాప్తంగా పర్యటించారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 1997లో కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.
2000 నుండి 2004 దాకా బీజేడీ- బీజేపీ సంకీర్ణ సర్కార్ లో మంత్రిగా ఎదిగారు. 2021 దాకా జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. సంతాల్ కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. సంతాలీ, ఒడియా భాషల్లో అద్భుతమైన వక్తగా పేరొందారు.
ఈ ప్రాంతంలో రోడ్లు, ఓడ రేవులు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కృషి చేశారు. 2014లో రాయ్ రంగ్ పూర్ నుంచి పోటీ చేసిన ముర్ము బీజేడీ అభ్యర్థి చేతిలో ఓడి పోయారు. మయూర్ భంజ్ కు చెందిన ముర్ము భువ నేశ్వర్ లోని రమాదేవి కాలేజీలో డిగ్రీ చదివారు.
నీటి పారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో గౌరవ టీచర్ గా పనిచేశారు.
2007లో నీల కంఠ్ అవార్డును అందుకున్నారు ఎమ్మెల్యేగా. ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశు సంవర్దక శాఖలను నిర్వహించారు.
Also Read : రాష్ట్రపతి గెలుపులో నరేంద్ర మోదీ మార్క్