Dravid : ద్ర‌విడ్ రికార్డు విరాట్ కోహ్లీ బ్రేక్

అత్య‌ధిక ప‌రుగుల జాబితాలో చోటు

Dravid : భార‌త టెస్టు క్రికెట్ సార‌థి ఊహించ‌ని రీతిలో ఫామ్ లోకి వ‌చ్చాడు. కేప్ టౌన్ వేదికగా భార‌త్ , సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు జ‌రుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టీమిండియాకు ఆదిలోనే క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అన‌వ‌స‌రంగా ఆడి వికెట్ల‌ను పారేసుకున్నారు ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్ , కేఎల్ రాహుల్. ఇక ఎప్ప‌టి లాగే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న భార‌త జ‌ట్టును సార‌థిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

అత‌డికి స‌పోర్ట్ గా చ‌తేశ్వ‌ర్ పుజారా, పంత్ తోడ్పాటు అందించారు. మ‌రోసారి ర‌హానే విఫ‌ల‌య్యాడు. సెంచ‌రీ చేస్తాడ‌ని అనుకున్న స‌మ‌యంలో అన‌వ‌స‌రంగా అవుట‌య్యాడు కోహ్లీ. 79 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు.

భార‌త బ్యాట‌ర్లు వరుస‌గా విఫ‌ల‌మైన చోట కెప్టెన్ మాత్రం అద్బుత‌మైన ఇన్నింగ్స్ తో మెరిశాడు. ర‌బ‌డ బౌలింగ్ లో వెర్రియేన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

గ‌త రెండు ఏళ్లుగా సెంచ‌రీ త‌న ఖాతాలో లేకుండా పోయింది. ఇదే అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం. అంత‌కు ముందు 2020లో ఆసిస్ వేదిక‌గా 74 చేసిన‌వే. జ‌ట్టు కోచ్ మాజీ కెప్టెన్ ద్ర‌విడ్ (Dravid)రికార్డును బ్రేక్ చేశాడు.

ఇదే స‌ఫారీ గ‌డ్డ‌పై రాహుల్ 11 టెస్టుల్లో 624 ప‌రుగులు చేస్తే ఆ స్కోర్ ను కోహ్లీ అధిగ‌మించాడు. టాప్ లో టెండూల్క‌ర్ ఉన్నాడు. కాగా 15 మ్యాచ్ లు ఆడిన స్టార్ మాజీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ టాప్ లో ఉన్నాడు. 15 మ్యాచ్ లు ఆడి 1161 ప‌రుగులు చేశాడు.

Also Read : వాషింగ్ట‌న్ సుంద‌ర్ కు కరోనా

Leave A Reply

Your Email Id will not be published!